ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘మహాశక్తి’తో మహిళలే.. మహారాణులు

ABN, Publish Date - Jan 09 , 2024 | 10:36 PM

ఖ్యమంత్రి జగన చేతు ల్లో మోసపోయిన రాష్ట్ర మహిళందరినీ తిరిగి మహారాణులుగా తీర్చిదిద్దేందుకే చంద్రబాబు నాయుడు ‘మహాశక్తి’ పథకం తెచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

కురవపల్లెలో టమోట పంట నష్టాలపై కిశోర్‌కుమార్‌ రెడ్డికి వివరిస్తున్న రైతులు

పీలేరు, జనవరి 9: ముఖ్యమంత్రి జగన చేతు ల్లో మోసపోయిన రాష్ట్ర మహిళందరినీ తిరిగి మహారాణులుగా తీర్చిదిద్దేందుకే చంద్రబాబు నాయుడు ‘మహాశక్తి’ పథకం తెచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. పీలేరు పట్టణం కటు ్టకాలువ వీధి, గోరీలతోపు, శ్రీనాథపురం ప్రాంతా ల్లో మంగళవారం ఆయన జనసేన నాయకుల తో కలిసి ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే మహి ళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను వివరించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు మహిళలకు అనేక హామీలిచ్చిన జగన, అధికారంలోకి వచ్చాక మహిళలను దారుణంగా మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కరపత్రా ల ద్వారా ఆయా పథకాలను మహిళలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కలికిరి: మండలంలోని పారపట్ల పంచాయతీలోని కురవపల్లె, బాలాజీ కాలనీ, పారపట్ట గ్రామాల్లో టమోటా రైతులు తమ సమస్యలను నల్లారి ముందు ఏకరువుపెట్టారు. కనీస మద్దతు ధర లభించడం లేదని, రూ.3 వేల కోట్లతో వ్యవసాయ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన జగన మోసం చేశాడని విమర్శించారు. సూక్ష్మ సేద్య పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, పెట్టుబడి సహాయాలు, పండ్ల తోటలకు ఆర్థిక చేయూత, ఇనపుట్‌ సబ్సిడీ, పంట నష్ట పరిహారాలులాంటి టీడీపీ పథకాలన్నీ జగన ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్ర శేఖర్‌, మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, సర్పంచులు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, రెడ్డిరాము, యల్లయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కలకడ: స్థానిక ఇందిరమ్మ కాలనీలో మంగళవారం కలకడ మండల మైనారిటీ నాయకులు ఇంటింట కరపత్రాలను అంద జేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీ కార్పొరేషన రుణాలు, రంజాన తోఫాతోపాటు పలు పథకాల ద్వారా లబ్ధిపొందిన విషయాన్ని గుర్తు చేశారు. ానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జిలానీ, నౌషాద్‌, ముబారక్‌అలీ, ఇర్ఫాన, ఖాజా, యూత సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 10:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising