ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది

ABN, Publish Date - Jan 05 , 2024 | 12:36 AM

రాష్ట్రంలో పోలీసురాజ్యం నడుస్తోందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.ఆంజనేయులు అన్నారు.

మైలవరంలో అంగన్వాడీల రాస్తారోకో

మైలవరం, జనవరి 4: రాష్ట్రంలో పోలీసురాజ్యం నడుస్తోందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.ఆంజనేయులు అన్నారు. చలో కలెక్టరేట్‌ సందర్భంగా జరిగిన అరెస్టులకు నిరసనగా అంగన్వాడీలు మైలవరంలో గురువారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులతో ఉద్యమాల అణిచివేతలను చేయిస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్‌ సుధాకర్‌, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌ బాబురావు, కె.బాలకృష్ణ, వెంకటేశ్వరరెడ్డి, వెంకట రెడ్డి, ఆర్‌.ఆర్‌.వి.పుష్పకుమారి, సీహెచ్‌ శారద, బుల్లెమ్మ, రబ్బాని, మాణిక్యం, విజయలక్ష్మి, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

తిరువూరులో..

తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించమని అంగన్వాగీలు నినాదాలు చేశారు. గురువారం 24వ రోజు సమ్మెను కొనసాగించారు. చలో కలెక్టరేట్‌ పిలుపు సందర్భంగా పోలీసులు తమ పట్ల ప్రదర్శించిన తీరుపై అభ ్యంతరం తెలిపారు. ప్రభుత్వం, అధికారులు బెదిరింపు ప్రకటనలు చేస్తుండటం శోచనీయమన్నారు. అంగన్‌వ్వాడీ వర్కర్లు అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు పద్మ, నాగమణి, శ్రీలక్ష్మి, ఉష, కస్తూరి, కుమారి, నాగేంద్ర, పద్మ, వెంకటేశ్వరమ్మ, భవాని, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising