ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా యోగి వేమన జయంతి

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:43 AM

వేమన పద్యాలు, శతకాలలోని నీతిని జీవితంలో అనుకరించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి సంపత్‌కుమార్‌ అన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న గ్రంథాలయాధికారి సంపత్‌కుమార్‌

ఘనంగా యోగి వేమన జయంతి

సత్యనారాయణపురం, జనవరి 19: వేమన పద్యాలు, శతకాలలోని నీతిని జీవితంలో అనుకరించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి సంపత్‌కుమార్‌ అన్నారు. సత్యనారాయణపురం చిత్తరంజన్‌శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ప్రజాకవి యోగి వేమన 657వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వేమన చిత్రపటానికి సంపత్‌కుమార్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదాయనికి హత్తుకునేలా చెప్పాడన్నారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన తెలుగు పద్యాలు ప్రతీ ఒక్కరికి సుపరిచితాలు అన్నారు. విద్యార్థులకు వేమన నీతి పద్యాలను వివరించారు. అనంతరం వేమన నీతిపద్యాలలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 12:43 AM

Advertising
Advertising