ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హామీలు నెరవేర్చకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లేది..

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:00 AM

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలని బుధవారం జరిగిన మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు.

విస్సన్నపేట, జనవరి 31: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలని బుధవారం జరిగిన మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. ఎంపీపీ పిల్లి మెర్సివనజాక్షి అధ్యక్ష తన బుధవారం సమావేశం జరిగింది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటని వైస్‌ ఎంపీపీ గాజుల శ్రీనివాసరావు, కో ఆప్షన్‌ సభ్యుడు జాపర్‌బాబా తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హౌసింగ్‌ ఏఈ గోపాలకృష్ణను ప్రశ్నించారు. పుట్రేల పంచా యతీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని ఎంపీటీసీ సభ్యుడు గార్లపాటి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్కువ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరు కావడంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. ఎంపీడీవో ఎస్‌.వెంకటరమణ, డీటీ మోతియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 01:00 AM

Advertising
Advertising