ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామమాత్రపు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

ABN, Publish Date - Feb 02 , 2024 | 12:39 AM

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నామమాత్రపు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సీహెచ్‌ అమర సుధీర్‌ అన్నారు.

నామమాత్రపు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సీహెచ్‌ అమర సుధీర్‌

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నామమాత్రపు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సీహెచ్‌ అమర సుధీర్‌ అన్నారు. బడ్జెట్‌ సందర్భంగా కేబీఎన్‌ కాలేజీ యూజీ, పీజీ కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంటే కేవలం కొద్ది కాలానికి మాత్రమే వర్తించేదని తెలిపారు. ప్రభుత్వం చేసే వ్యయాలను ఆమో దించేందుకు బడ్జెట్‌లో ప్రవేశపెడతారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నామ మాత్రంగానే ఉందన్నారు. మరో ఆడిటర్‌ బీవీఎస్‌ లింగమూర్తి మాట్లాడుతూ, ఎన్నికల తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్నారు. మరో ఆడిటర్‌ గుండా గంగాఽ ధర్‌ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కోసం బడ్జెట్‌ అవసరమన్నారు. విద్యార్థులు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర రావు, పీజీ డైరెక్టర్‌ ఎస్‌ వెంకటేష్‌, విభాగాధిపతులు హేమంత్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:39 AM

Advertising
Advertising