పారిశుధ్య కార్మికులను మోసగించిన జగన్
ABN, Publish Date - Jan 10 , 2024 | 12:42 AM
పారిశుధ్య కార్మికులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని సీఐటీయూ పశ్చిమ నగర ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ బోయి సత్యబాబు దుయ్యబట్టారు.
పారిశుధ్య కార్మికులను
మోసగించిన జగన్
కార్పొరేటర్ బోయి సత్యబాబు
చిట్టినగర్, జనవరి 9: పారిశుధ్య కార్మికులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని సీఐటీయూ పశ్చిమ నగర ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ బోయి సత్యబాబు దుయ్యబట్టారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆందోళనలో భాగంగా మంగళవారం కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్ నుంచి సర్కిల్-1 కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులుగా పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎస్మా చట్టాల పేరిట కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారన్నారు. వెంటనే ప్రభుత్వం కార్మికుల, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమింపచేయాలని కోరారు. కె.సూరిబాబు, కొండలు, ఆదిలక్ష్మి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2024 | 12:42 AM