ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు వజ్రాయుధం

ABN, Publish Date - Jan 26 , 2024 | 01:02 AM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని అది వజ్రాయుధంతో సమానమని గన్నవరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.చంద్రలీల అన్నారు.

వీరవల్లిలో సీనియర్‌ ఓటర్లకు సత్కారం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

గన్నవరం, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని అది వజ్రాయుధంతో సమానమని గన్నవరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.చంద్రలీల అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం గన్నవరం బాలుర హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొ న్నారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తహసీల్దార్‌ సీహెచ్‌ నరసింహారావు, ఎంఈవో కొండా రవికుమార్‌, డీటీ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌ వై.యశోదలక్ష్మి విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఓటు సద్వినియోగంతోనే సుపరిపాలన సాధ్యం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి పరిపాలన సాధ్యమవుతుందని ఓట ర్లకు నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ కో-ఆర్డినేటర్‌ ఆళ్ల గోపాలకృష్ణ సూచిం చారు. రంగన్నగూడెంలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. కసుకుర్తి సుబ్బారావు, కాట్రు పాపారావు, సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ, బీఎల్వో దుర్గాప్రసాద్‌, నజీమున్సీసా, హెచ్‌ఎం గ్లోరీ స్వర్ణలత పాల్గొన్నారు. వీరవల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఐదు గురు సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. పంచాయతీ కార్యదర్శి శ్యామ లరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ కోడెబోయిన బాబి, హెచ్‌ఎం నిర్మల, వీఆర్వో శేఖర్‌, మోర్ల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీ

హనుమాన్‌జంక్షన్‌: ఓటు విలువను గుర్తించి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని బాపులపాడు తహసీల్దార్‌ సునీల్‌బాబు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. బాపులపాడు జడ్పీ హైస్కూల్‌లో సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. హైస్కూల్‌ విద్యార్థు లకు వ్యాసరచన, డిబేట్‌ పోటీలు పెట్టి, విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎంపీడీవో కె.జోగేశ్వరరావు, డీటీ వెంకట రమణ, హెచ్‌ఎం నాగేశ్వరరావు, ఆర్‌ఐ రాజేష్‌, వీఆర్యేలు పాల్గొన్నారు.

విద్యార్థులకు పోటీలు

ఉంగుటూరు: ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తహసీల్దార్‌ డి.వనజాక్షి సూచించారు. జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం చోరగుడి అనిత అధ్యక్షతన నిర్వహించిన అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా వనజాక్షి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ, దాని ప్రాధాన్యాన్ని వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు సీనియర్‌ ఓట ర్లను సన్మానించారు. ఎంఈవో-2 జె.సాంబశివరావు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

ఓటేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతాం

ఓటుహక్కును వినియోగించుకోనివారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కును కోల్పోతారని ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. ఇందుపల్లి గ్రామసచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. సీనియర్‌ మహిళా ఓటర్లును సత్కరించారు. ఓటుహక్కు వినియోగంపై యువతీయువకులతో ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్‌ బండి వెంకటలక్ష్మి, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, ఎంఈవో-2 జె.సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి బి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 01:02 AM

Advertising
Advertising