ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే...

ABN, Publish Date - Feb 03 , 2024 | 07:02 AM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 8వ తేదీ తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని వసంత వైసీపీకి షాక్ ఇచ్చారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 8వ తేదీ తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని ఆయన వైసీపీకి షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారని ఇదివరకే ఆయన సీఎం జగన్‌కు చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు.

కాగా ఇటీవల వసంత కృష్ణప్రసాద్‌ను జగన్ పిలిపించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయాలని సూచించారు. విమర్శలు చేస్తేనే తన వారని గుర్తిస్తారని చెప్పారు. అయితే వారిపై విమర్శలు చేయడం తన వల్ల కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో వసంత ఇప్పటికే రెండు సార్లు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీకి షాక్ ఇవ్వడంతో వైసీపీ అధిష్టానం ఖంగుతింది. వెంటనే శుక్రవారం మైలవరం జడ్పీటీసీ తిరుపతి రావు యాదవ్‌ను ఇంఛార్జిగా వైసీపీ ప్రకటించింది. తిరుపతిరావు స్థానంలో మంత్రి జోగి రమేష్ త్వరలో వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని కృష్ణప్రసాద్ బహిరంగంగా ఆరోపించారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. వసంత వ్యాఖ్యలతో వైసీపీ హైకమాండ్ ఖంగు తింది.

Updated Date - Feb 03 , 2024 | 07:02 AM

Advertising
Advertising