నేపాల్ మహిళ ఆత్మహత్య
ABN, Publish Date - Jan 06 , 2024 | 12:38 AM
టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారు పేటలో నివాసముంటున్న నేపాల్ మహిళ మన్రూప(27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు, జనవరి 5: టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారు పేటలో నివాసముంటున్న నేపాల్ మహిళ మన్రూప(27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్రూప, ఆమె భర్త పూర్ణబహదూర్ ఆర్థిక సమస్యలతో నేపాల్‌ను వదిలేసి కుటుంబ సభ్యులతో కలిసి కర్నూ లు వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో పని చేస్తున్నారు. ఆర్థిక సమ స్యలతో కొన్ని గొడవలు జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా పూర్ణబహూదూర్ హోటల్‌కు వెళ్లిపోయాడు. తర్వాత కొద్దిసే పటికి మన్రూప ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 06 , 2024 | 12:38 AM