ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాటసాని అడ్డాలో వైసీపీ సభకు జనం కరువు

ABN, Publish Date - Jan 05 , 2024 | 12:15 AM

సామాజిక సాధికార సభ పేరుతో వైసీపీ జనసమీకరణ చేస్తున్నా ఆ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది.

సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సు

నేతలు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనం

కర్నూలు(అర్బన్‌), జనవరి 4: సామాజిక సాధికార సభ పేరుతో వైసీపీ జనసమీకరణ చేస్తున్నా ఆ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది. గురువారం నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభ మరోసారి తుస్సుమంది. సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పుతున్న కాటసాని రాంభూపాల్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఊహించిన దానికంటే జనం తక్కువగా వచ్చారు. వచ్చిన వాళ్లు కూడా వైసీపీ నేతలు ప్రసంగాలు చేస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ కావడంతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌కు చెందిన ప్రధాన అనుచరుడు గుర్తించి వలంటీర్లను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నం చేశారు. గడివేముల, పాణ్యం మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు కీలక నాయకులు ఆపసోపాలు పడ్డారు. సాయంత్ర 5 గంటలకు చెన్నమ్మ సర్కిల్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదికపైకి చేరుకోగానే ప్రజలకు అభివాదం చేసేందుకు పోటీ పడ్దారు. కానీ ప్రజల నుంచి స్పందన కరువైంది. కీలక నాయకులు మాట్లాడుతుండగానే ఖాళీ అయిన కూర్చీలను వైసీపీ కార్యకర్తలే తొలగించడం కనిపించింది.

Updated Date - Jan 05 , 2024 | 12:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising