ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూమి కబ్జా

ABN, Publish Date - Feb 01 , 2024 | 12:11 AM

పత్తికొండ-ఆదోని రహదారిలో ఈరన్నస్వామి దేవాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుకు ఆనుకొని 616 సర్వే.నెంబరులో జగనన్న లేఅవుట్‌ కింద పత్తికొండ పట్టణ నిరుపేదలకు 232 మందికి ఇంటి స్థలాలను కేటాయించారు.

వంక పొరంబోకులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన దృశ్యం

దర్జాగా వంక భూమి కబ్జా !

పత్తికొండలో ఓ అధికార ప్రజాప్రతినిధి నిర్వాకం

వంకను పంచుకొని అక్రమ నిర్మాణాలు

పట్టాలిచ్చారంటూ బెదిరింపులు

చోధ్యం చూస్తున్న అధికారులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రజాప్రతినిధి ఏకంగా వంక స్థలాన్ని ఆక్రమించి దర్జాగా ఇంటి నిర్మాణం చేపట్టిన సంఘటనపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం.

పత్తికొండ టౌన్‌, జనవరి 31: పత్తికొండ-ఆదోని రహదారిలో ఈరన్నస్వామి దేవాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుకు ఆనుకొని 616 సర్వే.నెంబరులో జగనన్న లేఅవుట్‌ కింద పత్తికొండ పట్టణ నిరుపేదలకు 232 మందికి ఇంటి స్థలాలను కేటాయించారు. అదే సర్వే నెంబరులో పై ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంతా ఆ కాలనీలో ఓ మూలన ప్రవేశిస్తూ దిగువ ప్రాంతమున్న వంకలోకి కలుస్తుంది. అయితే, జగనన్న కాలనీ లేవుట్‌ కింద అక్కడ స్థలాలు ఇవ్వడం, ఈరన్న స్వామి దేవాలయం అభివృద్ధి చెందడంతో అక్కడున్న స్థలాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఆ వంక పొరంబోకు స్థలం ఖాళీగా ఉండటంతో ఆ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఏకంగా ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు తెర లేపి ఇంటి నిర్మాణం కోసం పునాదులు మొదలు పెట్టారు. ఆ ప్రజాప్రతినిధిని చూసిన మరికొంత మంది (రాజకీయ నాయకులు) సైతం పొరంబోకు వంకలోనే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. వంక పొరంబోకులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రశ్నిస్తే.. మాకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు.. అందుకే ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని అక్రమదారులు చెప్పడం చూస్తుంటే.. ఈ కబ్జాల పర్వం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. పేదలందరికీ సెంటున్నర స్థలం ప్రకారం స్థలాలను కేటాయిస్తే.. అక్రమార్కులు మాత్రం ఏకంగా రెండు సెంట్లకు పైగా స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. ఈ తతంగమంతా రోడ్డుకు ఆనుకుని కబ్జాల అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అదికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం చూస్తుంటే.. వారి అండదండలతోనే ఈ అక్రమ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు అక్రమ చేపడుతున్న ఈ స్థలంలోనే భారీ కల్వర్టును ఈ మధ్యలోనే నిర్మించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలంలో పట్టాలు ఇచ్చారా.. లేక అక్రమ నిర్మాణాలు చేపట్టారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:11 AM

Advertising
Advertising