ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:41 AM

ఆర్ధిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్‌ కమిటి చైర్మన్‌, పాలకొండ నియోజక వర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు.

నంద్యాల (కల్చరల్‌), జనవరి 10: ఆర్ధిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్‌ కమిటి చైర్మన్‌, పాలకొండ నియోజక వర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎస్టిమేట్స్‌ కమిటి సమావేశాన్ని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి నిర్వహించారు. డీఆర్‌ఓ పుల్లయ్య, ఏపీ అసెంబ్లీ అసిస్టెంట్‌ సెక్రటరీ బిక్షం, సెక్షన్‌ ఆఫీసర్‌ కాశిరెడ్డి, ఎఎస్‌ఓ ఉమేష్‌ చంద్ర జిల్లా అధికారులు తదితరలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆసెంబ్లీ ఎస్టిమేట్స్‌ కమిటి చైర్మన్‌, పాలకొండ నియోజక వర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయం, నీటిపారుదల శాఖలకు సంబంధించిన బడె ్జట్‌ ఎస్టిమేట్స్‌ అడిగి తెలుసుకుంటూ క్షేత్రస్ధాయిలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుపై పరిశీలిస్తామన్నారు. కాంట్రాక్టర్లు జాప్యం చేయకుండా పనులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బీడు భూములకు అవసరమైన నీటిని కేటాయించి రైతుల నుంచి వాటర్‌ట్యాక్స్‌ వసూలు చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, సోషల్‌వెల్ఫేర్‌ డీడీ చింతామణి, ఆర్డబ్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, డీపీఓ మంజులవాణి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి తదితరులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులు, నెలకొన్న ఇబ్బందులను గురించి కమిటీ చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటి చైర్మన్‌ అధికారులకు తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 12:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising