ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏసీఏలో నిధుల దుర్వినియోగం

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:20 AM

ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)లో నిధుల దుర్వినియోగం జరుగుతోందని, దీని పరిపాలన కార్యకలాపాల నిర్వహణకు కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీవోఏ)ను నియమించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

హైకోర్టులో పిటిషన్‌.. నేడు విచారణ

అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)లో నిధుల దుర్వినియోగం జరుగుతోందని, దీని పరిపాలన కార్యకలాపాల నిర్వహణకు కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీవోఏ)ను నియమించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. చిత్తూరు జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి ఎస్‌.రవి, క్రికెట్‌ కోచ్‌ బి.విజయ్‌కుమార్‌ ఈ పిటిషన్‌ వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి నిధులు ఖర్చుపెట్టకుండా కొత్త స్టేడియం నిర్మాణానికి నిధులు ఖర్చుచేయడం లోథా కమిటీ సిఫార్సులకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌పై చర్యలు తీసుకొనేలా బీసీసీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వద్ద విచారణకు రానుంది.

Updated Date - Jan 03 , 2024 | 07:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising