ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కందుకూరు అభివృద్ధికి కలసిరండి : ఇంటూరి

ABN, Publish Date - Jan 13 , 2024 | 10:54 PM

కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రొఫెషనల్స్‌ అంతా బాధ్యత తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. సీఎం జగన్మోహనరెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రజల తలరాతలు మార్చే బాధ్యతను విద్యావంతులు, ఉ

13కెడికె3 : ప్రొఫెషనల్స్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు, జనవరి 13: కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రొఫెషనల్స్‌ అంతా బాధ్యత తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. సీఎం జగన్మోహనరెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రజల తలరాతలు మార్చే బాధ్యతను విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు తీసుకోవాలన్నారు. పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్‌హాలులో శనివారం రాత్రి నియోజకవర్గంలోని విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్లలో జగన్‌ వ్యవస్థలన్నింటిని నాశనం చేశాడని విమర్శించారు. ప్రస్తుతం మీరంతా మార్పునకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగుల ప్రశ్నలకు నాగేశ్వరరావు బదులిచ్చారు. కార్యక్రమంలో పొడపాటి తేజశ్విని, చల్లా శ్రీనివాసరావు, గొట్టిపాటి వంశీ, బొబ్బూరి వెంగళరావు, సునీల్‌, రసూల్‌, పువ్వాడి మౌనిక, దామా మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

--------------

Updated Date - Jan 13 , 2024 | 10:54 PM

Advertising
Advertising