కోడి పందేల స్థావరంపై దాడి
ABN, Publish Date - Jan 13 , 2024 | 10:49 PM
కావలి మండలం అన్నగారిపాలెం వద్ద శనివారం సాయంత్రం కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు, గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ సీఐ కాటూరి శ్రీనివాసరావు, తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందేలు
7 కోళ్లు, రూ.13,500 నగదు స్వాధీనం
కావలి రూరల్, జనవరి13: కావలి మండలం అన్నగారిపాలెం వద్ద శనివారం సాయంత్రం కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు, గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ సీఐ కాటూరి శ్రీనివాసరావు, తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 కోళ్లు, రూ.13,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
------------------------------
Updated Date - Jan 13 , 2024 | 10:49 PM