సాదాసీదాగా సంగం మండల సమావేశం
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:04 PM
స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాదాసీదాగా జరిగింది. ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూ
సంగం, జనవరి 30: స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాదాసీదాగా జరిగింది. ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ వంటి పలు శాఖలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించారు. అనంతరం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతుండగా జెండాదిబ్బ సర్పంచు పద్మావతి కల్పించుకుని గత సమావేవంలో సభ దృష్టికి తెచ్చిన విద్యుత్ స్తంభాల సమస్యను ఇంత వరకు పరిస్కరించలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించని సభలు, సమీక్షలు ఎందుకని నిలదీశారు. అన్ని శాఖల గురించి చర్చిస్తున్నారు, కానీ మండల పరిషత్ నిధుల వినియోగంపై సమీక్ష చేయడం లేదని వెంగారెడ్డిపాళెం సర్పంచు ఆనం ప్రసాద్‌రెడ్డి ఎంపీడీవో గోపీని ప్రశ్నించారు. దీంతో ఆయన మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనులను గ్రామాల వారీగా వివరించారు. సుమారు రూ. 34 లక్షలతో సీసీ డ్రైన్‌లు చేపట్టినట్లు వివరించారు. అనంతరం తహసీల్దారు ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్‌పై వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిఽధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 11:04 PM