విలువ లేని పదవి మాకెందుకు ?
ABN, Publish Date - Jan 28 , 2024 | 09:57 PM
అధికారపార్టీ ఎంపీటీసీగా రూ. లక్షలు ఖర్చు పెట్టి గెలిచినా. పార్టీలో కనీస విలువ కూడా లేదని విరువూరు ఎంపీటీసీ కే లక్ష్మీదేవి దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మవరంలోని తన నివాసంలో భర్త రమేష్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన భూపంపిణీ పథకంలో భాగంగా పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సూచన
రాజీనామా దిశగా ఎంపీటీసీ దంపతులు
అధికారపార్టీ నేతలపై మండిపాటు
వరికుంటపాడు, జనవరి 28: అధికారపార్టీ ఎంపీటీసీగా రూ. లక్షలు ఖర్చు పెట్టి గెలిచినా. పార్టీలో కనీస విలువ కూడా లేదని విరువూరు ఎంపీటీసీ కే లక్ష్మీదేవి దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మవరంలోని తన నివాసంలో భర్త రమేష్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన భూపంపిణీ పథకంలో భాగంగా పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సూచన మేరకు అర్హుల జాబితాను రూపొందించి ఆయన వద్దకు తీసుకెళ్లామన్నారు. అనంతరం సంతకాలు చేసిన ఆయన ఆ జాబితాను మండలంలో కీలకంగా వ్యవహరించే నాయకుడికి అప్పగించాలని చెప్పడంతో ఆయన వద్దకు వెళ్లగా అడ్వాన్స్‌గా రూ. 3లక్షలు చెల్లించాలని ఆదేశించడంతో విస్తుపోయామన్నారు. తెలంగాణాలో బేల్దారి పనులు చేసుకుంటున్న తమను తీసుకొచ్చి రాజకీయంగా అప్పులపాలు చేశారని వారు వాపోయారు. ఈ పరిస్థితుల్లో నగదు ఇవ్వలేమని చెప్పగా, తాము ప్రతిపాదించిన జాబితాను పక్కన పడేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. పదవి చేపట్టి మూడేళ్లయినప్పటికీ ఇంతవరకు పైసా నిధులు కూడా అందకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టే పరిస్ధితి లేకుండా పోయిందన్నారు. దీంతో మనోవేదన తట్టుకోలేక పదవులతోసహా పార్టీకి కూడా త్వరలోనే రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వారు తెలిపారు.
-------------
Updated Date - Jan 28 , 2024 | 09:57 PM