నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:02 PM
నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన గ్రూప్-2 ఉచిత కోచింగ్ కోసం
ఆత్మకూరు, జనవరి 30 : నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన గ్రూప్-2 ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు సొంత నిధులతో మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనేది వలంటీర్ల సహకారంతో వివరాలు సేకరించామన్నారు. గుంటూరు టార్గెట్ ఐఏఎస్ అకాడమీ సహకారంతో గ్రూప్-2కు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ముందుగా ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పొదుపు మహిళలకు ఆసరా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జివెంకటరమణమ్మ, వైస్ చైౖర్మన్ డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, షేక్ సర్దార్, కమిషనర్ బీ నాగేశ్వరరావు, జేఏసీ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
---------------------
Updated Date - Jan 30 , 2024 | 11:02 PM