ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోడి పందేలపై దాడి.. 13 మంది అరెస్టు

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:54 PM

మండలంలోని దొండపాడు - వద్దిపాడు గ్రామాల మధ్య పొలాల్లో కోడి పందేలు జరుగుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి న సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అందిన వివరాల మేరకు దొనకొండ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ ఎం.సైదుబాబు తన సిబ్బందితో మారు వే షాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దా డిలో కోడి పందాళ్లు ఆడుతున్న దొండపాడు పరిసర గ్రామాలకు చెందిన 13 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.17450 నగదు, ఎనిమిది కోడి పుంజులు, పది సెల్‌ఫోన్లు, 23 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎ స్‌ఐ సైదుబాబు తెలిపారు.

23 మోటార్‌ సైకిళ్లు, రూ.17,450, 10 సెల్‌ ఫోన్లు స్వాధీనం

దొనకొండ, జనవరి 7 : మండలంలోని దొండపాడు - వద్దిపాడు గ్రామాల మధ్య పొలాల్లో కోడి పందేలు జరుగుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి న సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అందిన వివరాల మేరకు దొనకొండ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ ఎం.సైదుబాబు తన సిబ్బందితో మారు వే షాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దా డిలో కోడి పందాళ్లు ఆడుతున్న దొండపాడు పరిసర గ్రామాలకు చెందిన 13 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.17450 నగదు, ఎనిమిది కోడి పుంజులు, పది సెల్‌ఫోన్లు, 23 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎ స్‌ఐ సైదుబాబు తెలిపారు. కోడి పందెం ఆడుతూ పట్టుబడిన 13 మందిని, 23 మోటార్‌ సైకిళ్లను ట్రాక్టర్లల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పూర్తిస్థాయి వి చారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్శి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా కోడి పందేలు, పేకాట ఆడుతున్న ట్లు తెలిస్తే 9121102175 నెంబరుకు చెప్పాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై దాడి చేసి 29 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సైదుబాబు తెలిపారు. మండలంలోని మంగినపూడి గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దుకాణంలో అక్రమ మద్యం విక్రయిస్తుండగా పట్టుకొని తనిఖీ చేయగా 29 అక్రమ మద్యం బాటిల్స్‌ దొరికినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్శి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ముండ్లమూరు : మండలంలోని పసుపుగల్లు, పోలవరం, వేములబండ గ్రామంలోని బెల్టు షాపులపై ఎస్‌ఐ యూ వెంకట కృష్ణయ్య తన సిబ్బందితో వెళ్లి ఆదివారం దాడులు చేయగా 49 మద్యం సీసాలు పట్టుబడినట్టు ఎస్‌ఐ వెంకట కృష్ణయ్య తెలిపారు. 25 పసుపుగల్లు, 17 పోలవరం, వేములబండలో ఏడు సీసాలు పట్టుబడినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఏఎ్‌సఐ బీ పవన్‌ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, సిబ్బంది మహేష్‌, కాశీరాజు, తుపాకుల శ్రీను పాల్గొన్నారు.

తాళ్లూరు : మండలంలోని లక్కవరం గ్రామంలో ఎస్‌ఐ వైవీ రమణయ్య ఆ ధ్వర్యంలో పోలీసులు అక్రమంగా మద్యం విక్రస్తున్న షాపులపై దాడులు చే సిన ఇద్దరు వ్యక్తుల వద్ద 46 లిక్కర్‌ బాటిళ్లను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అక్రమంగా షాపులలో మద్యం అమ్ముతున్నారన్న సమాచా రం మేరకు దాడులు నిర్వహించారు.గ్రామంలోని దేవెళ్ల రమణమ్మ ఇంట్లో అ నుమతి లేకుండా అమ్మకానికి ఉంచిన 38 లిక్కర్‌ బాటిళ్లు, కొండలు షాపులో 8 లిక్కర్‌ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాటిళ్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి ఇరువురిని దర్శి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 09:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising