ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN, Publish Date - Jan 30 , 2024 | 12:41 AM

స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కే శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 29 : స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కే శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 236 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరప్రసాద్‌, ఝాన్సీలక్ష్మి, మాఽధురితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.

ఫ జలకల పథకం ద్వారా బోరు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పొన్నలూరు మండలం రెడ్డిపాలెంకు చెందిన డి. బ్రహ్మయ్య కోరారు. బోరు వేసేందుకు సర్వే కూడా చేశారని, కానీ బోరు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వె ంటనే బోరు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫ తన వ్యవసాయ భూమికి ఆన్‌లైన్‌లో 1బీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కనిగిరి మండలం పునుగోడుకు చెందిన సుబ్బారెడ్డి కోరారు. 272 సర్వేనెంబరులో 1206 ఖాతా నెంబరు ఉందని తెలిపారు. కానీ ఆన్‌లైన్‌లో 1బీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు.

Updated Date - Jan 30 , 2024 | 12:41 AM

Advertising
Advertising