Rajahmundry: ఆపరేషన్ సక్సెస్.. 9 మంది దారి దోపిడీ నిందితులు అరెస్టు
ABN, Publish Date - Feb 26 , 2024 | 08:30 PM
రాజమండ్రిలో (Rajahmundry) దారి దోపిడీకి (Robbery) పాల్పడిన నిందితుల్ని పట్టుకోవడం కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ (Special Operation) విజయవంతం అయ్యింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మొత్తం 9 మంది నిందితుల్ని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల మూడు లక్షల విలువైన 3.5 కేజీల బంగారు నగల్ని రికవరీ చేశారు.
రాజమండ్రిలో (Rajahmundry) దారి దోపిడీకి (Robbery) పాల్పడిన నిందితుల్ని పట్టుకోవడం కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ (Special Operation) విజయవంతం అయ్యింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మొత్తం 9 మంది నిందితుల్ని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల మూడు లక్షల విలువైన 3.5 కేజీల బంగారు నగల్ని రికవరీ చేశారు. అలాగే.. 15 లక్షల విలువైన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా.. తూర్పు గోదావరి జిల్లా ఎస్‌పీ పీ. జగదీష్ (P Jagadish) ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఫిబ్రవరి 21వ తేదీన బంగారు నగల వ్యాపారి బాలు నాథూరం జంగారెడ్డిగూడెం నుండి బీమవరంకు కారులో బయలుదేరారని, మార్గమధ్యంలో కొందరు నిందితులు ఆయనపై దారి దోపిడీకి పాల్పడ్డారని ఎస్‌పీ జగదీశ్ తెలిపారు. ఆయన్ను బెదిరించి.. 3.5 కేజీల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షలు నగదుని అపహరించారని చెప్పారు. నాథూరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితుల్ని పట్టుకోవడం కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలతో పాటు ఇతర పక్కా సమాచారం ఆధారంగా.. రాజమండ్రి నుంచి ఇన్నోవా క్రిస్టా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో వెళుతున్న 9 మంది నిందితులను పట్టుకున్నామని ఎస్‌పీ వివరించారు.
ఈ నిందితులందరూ జంగారెడ్డిగూడెంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితులను చలపాక వెంకటేష్, మద్దిపాటి కళ్యాణ్, కోడూరి రవితేజ, కోనా శ్రీనివాస్, వేముల మంజుబాబు, షేక్ నాగూర్ మీరావల్లి, వేముల మోహన్ సాయి, మోహన్ నారాయణ్, పమిడిపల్లి బ్రహ్మాజీలుగా గుర్తించారు. వీళ్లు గతంలోనూ ఇలాంటి దోపిడీలకు పాల్పడ్డారా? లేదా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఈమధ్య దారి దోపిడీలు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరిపైన అనుమానం కలిగితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
Updated Date - Feb 26 , 2024 | 08:30 PM