ఉప్పరపేట వద్ద బొగ్గు లారీ బోల్తా
ABN, Publish Date - Jan 05 , 2024 | 12:20 AM
అంధవరం పంచాయతీ ఉప్పరపేట వద్ద గురువారం ఉదయం బొగ్గుతో వెళుతున్న లారీ బోల్తాపడింది. నరసన్నపేట నుంచి పర్లాం వైపు వెలుతున్న లారీ బోల్తాపడగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఉప్పరపేట వద్ద వంతెన భారీ ఇసుక లోడులు వెళ్లడంతో కూలిపోయింది. వాహనాలు రాకపోకలకు అంతరాయం లేకుండా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడే ప్రస్తుతం బొగ్గుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఆ సమయానికి లారీలో డ్రైవరు ఒక్కడే ఉన్నాడు. అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్.ఐ పి.పారినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చత్తీస్గడ్ వెళ్లాల్సిన బొగ్గులారీ రూటు తప్పి లూప్లైన్లోకి వెళ్లి బోల్లాపడిందని ఆయన తెలిపారు.
జలుమూరు: అంధవరం పంచాయతీ ఉప్పరపేట వద్ద గురువారం ఉదయం బొగ్గుతో వెళుతున్న లారీ బోల్తాపడింది. నరసన్నపేట నుంచి పర్లాం వైపు వెలుతున్న లారీ బోల్తాపడగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఉప్పరపేట వద్ద వంతెన భారీ ఇసుక లోడులు వెళ్లడంతో కూలిపోయింది. వాహనాలు రాకపోకలకు అంతరాయం లేకుండా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడే ప్రస్తుతం బొగ్గుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఆ సమయానికి లారీలో డ్రైవరు ఒక్కడే ఉన్నాడు. అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్.ఐ పి.పారినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చత్తీస్గడ్ వెళ్లాల్సిన బొగ్గులారీ రూటు తప్పి లూప్లైన్లోకి వెళ్లి బోల్లాపడిందని ఆయన తెలిపారు.
Updated Date - Jan 05 , 2024 | 12:20 AM