ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హామీలను అమలు చేయాలి

ABN, Publish Date - Jan 07 , 2024 | 11:37 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సమగ్రశిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న 19వ రోజు సమ్మె శిబిరాన్ని యూటీఎఫ్‌ కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ సందర్శించారు.

అచ్చెన్నాయుడుకు వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘ నేతలు

- సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్‌

అరసవల్లి, జనవరి 7: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సమగ్రశిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న 19వ రోజు సమ్మె శిబిరాన్ని యూటీఎఫ్‌ కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఉద్యోగులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సూర పాపారావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. యూటీఎఫ్‌ కార్యవర్గ సభ్యుడు మజ్జి మదన్‌మెహన్‌ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ జీతాలు పెంపుదల చేయాలని, పెండింగ్‌ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి శ్రీనివాసరావు, నర్సింగరావు, యుగంధర్‌, గౌరీశంకర్‌, శైలజ, జ్యోతి, రోహిణి, భారతి భవాని, నాగమణి, శశిరేఖ, చిన్నారావు, తవిటినాయుడు, చంద్రశేఖర్‌, ధనుంజయ పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు అండగా నిలవాలి

టెక్కలి: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాము చేపట్టిన ఉద్యమానికి అండగా నిలవాలని సమగ్ర శిక్ష జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం కోటబొమ్మాళిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, తమకు అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు. అచ్చెన్నాయుడును కలిసిన వారిలో ఆ సంఘ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, కోశాధికారి శ్రీనివాసరావు, నేతలు పోతయ్య, రాము, తారకేశ్వరరావు, జయలక్ష్మి, ఉషారాణి ఉన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising