ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బస్సుల్లో భద్రత ఎంత?

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:42 PM

జిల్లాలో ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. తరచూ బస్సులు మొరాయిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి.

బస్సులో కిటికీ అద్దాల మధ్య ఇరుక్కున్న సుందరరావు కోమర్తి జంక్షన్‌ వద్ద బోల్తాపడిన బస్సు (ఫైల్‌)

- ఆర్టీసీకి డొక్కు వాహనాలే గతి

- ఎక్కడ ఆగిపోతాయో తెలియని వైనం

- తరచూ ప్రమాదాలతో ప్రయాణికులకు ఇబ్బందులు

(రణస్థలం)

- ఈ నెల 25న పలాస నుంచి టెక్కలి వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో సుందరరావు అనే ప్రయాణికుడి తల కిటికీ అద్దాల మధ్య ఇరుక్కుంది. దాదాపు 15 నిమిషాల పాటు తోటి ప్రయాణికులు ప్రయత్నించినా తల బయటకు రాలేదు. దీంతో టెక్కలి పట్టణానికి వెళ్లగా స్థానికుల సాయంతో బలవంతంగా అద్దం రేకు వంచగా ఆయన తల బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

.....................

- గత ఏడాది అక్టోబరు 16న శ్రీకాకుళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నందిగాం మండలం తురకలకోట వద్ద ప్రమాదానికి గురైంది. స్టీరింగ్‌ రాడ్డు విరిగి రోడ్డుపక్కనే ఉన్న గోతిలోకి బస్సు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

.....................

- గత ఏడాది జూన్‌ 5న నరసన్నపేట సమీపంలోని కోమర్తి జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ ఊడి.. అదుపు తప్పి బోల్తాపడింది. బస్సులో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వెనుక ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

.....................

..ఇలా జిల్లాలో ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. తరచూ బస్సులు మొరాయిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి. కొత్తగా డిపోలకు చేరిన ఆలా్ట్ర డీలక్సులు, సూపర్‌ లగ్జరీ బస్సులు సైతం మొరాయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పల్లెవెలుగులు గురించి చెప్పనక్కర్లేదు. సక్రమంగా పనిచేయని స్టీరింగ్‌లు, పగిలిన అద్దాలు, విరిగిన నట్లు రణగొల ధ్వనులతోనే బస్సులను నడుపుతుండడంతో.. ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. జిల్లా పరిధిలో శ్రీకాకుళం 1,2 డిపోలు, పలాస, టెక్కలిలో డిపోల పరిధిలో 318 బస్సులు ఉన్నాయి. పల్లెవెలుగు సర్వీసులన్నీ కాలం చెల్లినవే. వాస్తవానికి 13లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు పల్లెవెలుగు సర్వీసులకు తిప్పుతున్న బస్సులన్నీ 13 లక్షల కిలోమీటర్లు ఎప్పుడో దాటిపోయినట్టు తెలుస్తోంది. తొలుత సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా ఉండే బస్సులు ఐదు లక్షల కిలోమీటర్లు దాటిన తరువాత పల్లెవెలుగులుగా వినియోగిస్తారు. ఎక్స్‌ప్రెస్‌లుగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త బస్సుల కొనుగోలు సక్రమంగా జరగడం లేదు.

డిపోల్లో మెకానిక్‌ల కొరత

జిల్లాలో 60 వరకూ డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని డిపోల్లోనూ మెకానిక్‌ల కొరత ఉంది. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయడం లేదు. 40 శాతం కాంట్రాక్ట్‌ సిబ్బందితోనే నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యూనియన్‌ నేతలు చెబుతున్నారు. డిపోల్లో నిపుణులైన మెకానిక్‌లు లేకపోవడం, విడి పరికరాలు సక్రమంగా సరఫరా కాకపోవడంతో బస్సుల మరమ్మతులు జరగడం లేదు. బస్సు డిపోల్లోకి చేరుకున్న తరువాత లోపాలను లాగ్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. వాటిని రాత్రికి మెకానిక్‌లు సరిచేస్తారు. కానీ సిబ్బంది లేకపోవడంతో ఈ విధానం సక్రమంగా అమలుకావడం లేదు. అది బస్సుల కండీషన్‌పై ప్రభావం చూపుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీలో కొత్త నియామకాలు లేవు. అడపాదడపా అప్రంటీస్‌ మేళాలో కొద్దిమందిని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించి చేతులు దులుపుకొంటున్నారు. ఒక్కోబస్సుకు డ్రైవర్‌, కండక్టర్‌, గ్యారేజీ మెకానిక్‌, సహాయకుడు కలుపుకొని ఐదుగురు సిబ్బంది ఉండాలి. కానీ బస్సుల నిష్పత్తి చూసుకుంటే ఇద్దరు కూడా ఉండని పరిస్థితి. మొత్తం నాలుగు డిపోల్లో 370మంది మంది వరకూ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై భారం పడుతోంది. 8గంటలపాటు డ్యూటీ చేయాల్సి ఉండగా 12 గంటలకు మించి చేయాల్సి వస్తోంది. దీంతో సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఒత్తిడితో ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇబ్బందులను అధిగమిస్తున్నాం

ప్రజారవాణే ఆర్టీసీ ధ్యేయం. ఇబ్బందులను అధిగమించి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. సిబ్బంది కొరత లేదు. ఇటీవల కొత్త రూట్లలో బస్సులు సైతం నడుపుతున్నాం. జిల్లాలో ప్రతి పట్టణానికి, మండల కేంద్రాన్ని కలిపేలా.. అన్ని రూట్లకు ప్రాధాన్యమిస్తున్నాం. బస్సుల కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

- రమేష్‌, ప్రజారవాణా అధికారి, శ్రీకాకుళం

Updated Date - Jan 28 , 2024 | 11:42 PM

Advertising
Advertising