ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వారి తీరు మారలే..

ABN, Publish Date - Jan 06 , 2024 | 11:50 PM

ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నా యి.. ఎంతో బాధ్య తగా ఉండాల్సిన రూరల్‌ మండలం సింగుపు రం పీహెచ్‌సీ వై ద్యులు, సిబ్బంది తీరు మారలేదు.

రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

- సింగుపురం పీహెచ్‌సీ సందర్శించిన డీఎంహెచ్‌వో

- వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మాపై ఆగ్రహం

- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

శ్రీకాకుళం క్రైం: ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నా యి.. ఎంతో బాధ్య తగా ఉండాల్సిన రూరల్‌ మండలం సింగుపు రం పీహెచ్‌సీ వై ద్యులు, సిబ్బంది తీరు మారలేదు. ఈ నెల 4న ‘సమయపాలన లేక.. సేవలందక’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథానానికి డీఎంహెచ్‌వో స్పందించి శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో ఉండాల్సి వైద్యాధికారిని చాందినితోపాటు మరో వైద్యురాలు, ఐదుగురు సిబ్బంది విధులకు రాకుండా డుమ్మా కొట్టారు. వారి తీరుపై డీఎంహెచ్‌వో అసహనం వ్యక్తం చేశారు. పలు రికార్డులు పరిశీలించి, రక్త పరీక్షల రికార్డుల్లో తేదీలు తారుమారు చేసినట్టు గుర్తించారు. డుమ్మా కొట్టిన వైద్యులతోపాటు సిబ్బందిని వివరణ కోరారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రజలకు సేవలందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కొద్ది రోజులుగా ఈ పీహెచ్‌సీలోని వైద్య సిబ్బంది పనితీరుపై విమర్శలు వస్తున్నా వారి తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 11:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising