ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంకా తేలని వైసీపీ మలి జాబితా

ABN, Publish Date - Jan 30 , 2024 | 02:52 AM

వైసీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా సాగుతోంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీలోగా అభ్యర్థుల జాబితా ప్రకటించాకే..

సీఎంవోకు ఎమ్మెల్యేలు క్యూ... గేటు దాకా వచ్చి వెనుదిరిగిన బాలినేని

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా సాగుతోంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీలోగా అభ్యర్థుల జాబితా ప్రకటించాకే.. ‘సిద్ధం’ పేరిట ఎన్నికల ప్రచారానికి వెళ్తానని సీఎం జగన్‌ అన్నారు. కానీ కసరత్తు జరుగుతూనే ఉంది. టికెట్లపై స్పష్టత రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లి సీఎం కార్యాలయానికి క్యూ కడుతున్నారు. సీఎంవో పిలుపుతో సోమవారం బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వచ్చారు. కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), మద్దిశెట్టి వేణుగోపాల్‌(దర్శి), సింహాద్రి రమేశ్‌(అవనిగడ్డ), విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వచ్చారు. సాయంత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం కార్యాలయానికి అకస్మాత్తుగా వచ్చారు. ఆయన కారు ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనుదిరిగింది. బాలినేని గన్‌మెన్‌ సీఎంవో గేటు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో మాట్లాడి వెనక్కి వచ్చారు. కారులో ఉన్న బాలినేనికి ఏదో సమాచారం అందించారు. దీంతో ఆయన వాహనం దిగకుండానే వెనుదిరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 30 , 2024 | 09:04 AM

Advertising
Advertising