ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిధుల కొరత వేధిస్తోంది

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:43 PM

పంచాయతీకి నిధుల కొరత వేధిస్తోందని, అందువల్లే గ్రామాల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మద్దికెర సర్పంచు బండారు సుహాసిని అన్నారు.

పంచాయతీ సమావేశంలో సర్పంచు స్పష్టీకరణ

మద్దికెర, జనవరి 30: పంచాయతీకి నిధుల కొరత వేధిస్తోందని, అందువల్లే గ్రామాల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మద్దికెర సర్పంచు బండారు సుహాసిని అన్నారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచు బండారు సుహాసిని అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు జమేదార్‌ జంబునాథ్‌ నాయుడు, వెంకట్రాయుడు మాట్లాడుతూ మేం పంచాయతీ సభ్యులుగా ఎంపికై రెండేళ్లు దాటిందని, ఇంత వరకు మా ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మేం తెలుగుదేశం పార్టీ వారమని మా ప్రాంతాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. జాతర మహోత్సవాలు మరో నెల రోజుల్లో జరుగుతాయని, ఇంత వరకు సదుపాయాల కల్పన చేపట్టలేదని పేర్కొన్నారు. నీటి సమస్యతో మా ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నా మీకు పట్టదా అంటూ నిలదీశారు. సర్పంచు బండారు సుహాసిని మాట్లాడుతూ పంచాయతీకి నిధుల కొరత వేధిస్తోందని, పార్టీలకతీతంగా గ్రామాలభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు ఎల్‌.లక్ష్మినారాయణ, చంద్రశేఖర్‌ గౌడు, ఎంపీటీసీ ఆంజనేయులు, బాలచంద్ర, వరప్రసాద్‌, ఈవోఆర్‌డీ మద్దిలేటి స్వామి, పంచాయతీ సలహాదారుడు బండారు ఆంజనేయులు, ఆమాంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:43 PM

Advertising
Advertising