ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కళ్లకు గంతలు కట్టుకుని సెర్ప్‌ ఉద్యోగుల ఆందోళన

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:41 PM

పట్టణంలో సెర్ప్‌ ఉద్యోగులు మంగళవారం వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. నెహ్రూచౌక్‌లోని బస్టాప్‌ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు

అనకాపల్లి టౌన్‌, జనవరి 30: పట్టణంలో సెర్ప్‌ ఉద్యోగులు మంగళవారం వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. నెహ్రూచౌక్‌లోని బస్టాప్‌ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే సెర్ప్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ డిమాండ్లను అమలు చేయాలని సెర్ప్‌ జేఏసీ ప్రతినిధి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సెర్ప్‌ జేఏసీ ప్రతినిధులు వాసు, గోవిందమ్మ, శ్రీనివాస్‌, రమణ, సత్యవతిలు పాల్గొన్నారు. సెర్ప్‌ ఉద్యోగుల ఆందోళన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెర్ప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పీలా పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:41 PM

Advertising
Advertising