ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీలో వర్గపోరు

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:28 AM

మండలంలో అత్యధిక ఓట్లు కలిగిన సెజ్‌ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో వైసీపీ వర్గ పోరు బయటపడింది. ఇక్కడ రెండు వర్గాలు ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే కన్నబాబు రాజు దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోకపోవడంతో పోరు తారస్థాయికి చేరి శిలాఫలకం ధ్వంసం చేసే స్థాయికి వెళ్లింది.

దిబ్బపాలెంలో ధ్వంసమైన శిలాఫలకం

- దిబ్బపాలెంలో ప్రారంభానికి ముందే శిలాఫలకం ధ్వంసం

- సొంత పార్టీ వారే చేశారని ఆరోపణలు

అచ్యుతాపురం, జనవరి 27: మండలంలో అత్యధిక ఓట్లు కలిగిన సెజ్‌ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో వైసీపీ వర్గ పోరు బయటపడింది. ఇక్కడ రెండు వర్గాలు ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే కన్నబాబు రాజు దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోకపోవడంతో పోరు తారస్థాయికి చేరి శిలాఫలకం ధ్వంసం చేసే స్థాయికి వెళ్లింది.

ఇక్కడ నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఈ నెల 29న ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రారంభించనున్నారు. అయితే సొంత పార్టీలోని కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన దిబ్బపాలెం పంచాయతీలో సుమారు తొమ్మిది వేల ఓట్లున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ పంచాయతీని వైసీపీ గెలుచుకుంది. సర్పంచ్‌తో పాటు ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కూడా వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాటకు ఎదురులేదు. అయినా వర్గ పోరు కారణంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఒక వర్గానికి చెందిన పేర్లు లేనందున దీనిని ధ్వంసం చేసినట్టు పలువురు చర్చించుకుంటు న్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 28 , 2024 | 12:28 AM

Advertising
Advertising