ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మా ఆవేదన పట్టదా?

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:18 AM

తమ ఆవేదన సర్కారుకు పట్టదా? అని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌ శిబిరం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు.

శిబిరంలో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

బెలగాం, జనవరి 10: తమ ఆవేదన సర్కారుకు పట్టదా? అని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌ శిబిరం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చిరుద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. నోటీసులతో భయాందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆ సంఘ నాయకులు స్పష్టం చేశారు.

Updated Date - Jan 11 , 2024 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising