ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌రెడ్డి ఓటమి ఖాయం

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:36 PM

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి ఓటమి ఖాయమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం కుదమ గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ పల్ల రాంబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు జరిగింది.

జయహో బీసీ సదస్సులో పాల్గొన్న టీడీపీ నేతలు

- వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

- చంద్రబాబు విజయానికి సమష్టిగా కృషి చేద్దాం

- బీసీ బహిరంగ సభలో టీడీపీ నాయకులు

జియ్యమ్మవలస, జనవరి 30: వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి ఓటమి ఖాయమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం కుదమ గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ పల్ల రాంబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌ హాజరై మాట్లాడారు. ‘రాష్ట్రంలో జగన్‌రెడ్డి నియంతృత్వ ధోరణితో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జగన్‌ తన ఓటమిని కొద్ది రోజుల క్రితమే అంగీకరించి భయపడుతున్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించే బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే మన బతుకులు కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతాయి. కొద్ది రోజుల్లోనే టీడీపీ ప్రభుత్వం రానుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అప్పుడు వైసీపీకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. మన అభ్యర్థి తోయక జగదీశ్వరిని గెలిపించాలి. రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబుతోనే సాధ్యం. మరొకసారి సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని నమ్మవద్దు.’ అని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ముఖ్య నాయకులు శేఖరపాత్రుడు, అక్కేన మధుసూదనరావు, ముదిలిబాబు విజయవాంకుశం, గురనా శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు డొంకాడ మంగమ్మ, నియోజక వర్గ జనసేన అధ్యక్షుడు కడ్రక మల్లేశ్వరరావు, వెంపటాపు భారతి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:36 PM

Advertising
Advertising