ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ను నమ్మి మోసపోయాం

ABN, Publish Date - Jan 05 , 2024 | 04:34 AM

మెగా డీఎస్సీ కోసం డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో గురువారం గంటకుపైగా రాస్తారోకో చేపట్టారు.

అవనిగడ్డ, జనవరి 4: మెగా డీఎస్సీ కోసం డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో గురువారం గంటకుపైగా రాస్తారోకో చేపట్టారు. చెప్పులు పైకెత్తి, చెంపలు వాయించుకుంటూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అవనిగడ్డకు వచ్చి, ఇక్కడి డీఎస్సీ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ‘పోయాం... మోసం’ అని నినదిస్తూ వంతెన సెంటర్‌లో బైఠాయించారు. వెంటనే మెగా డీఎస్సీ వేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. వారికి చేతులెత్తి మొక్కుతూ... తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా వచ్చిన టీడీపీ, జనసేన నేతలు, రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ముఖ్య నేతలు సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.

Updated Date - Jan 05 , 2024 | 06:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising