ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ను దించడానికి ప్రజలు సిద్ధం

ABN, Publish Date - Jan 27 , 2024 | 12:22 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.

గన్ని వీరాంజనేయులు

వైసీపీ పాలనపై టీడీపీ నేతల ధ్వజం

ఏలూరు టూటౌన్‌, జనవరి 26: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం బడేటి చంటితో కలిసి విలేకరులతో మాట్లాడారు. హ్యాపీగా దిగిపోతా అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నావు. ప్రజ లు తిరుగుబాటు చేస్తున్నారని అర్థమైందా జగన్‌ అంటూ ప్రశ్నించారు. ఇప్పటికి పుడు ఎన్నికలు వస్తే దిగిపోవడానికి ఏమాత్రం ఆలోచించనని జగన్‌ చెప్పడాన్ని చూస్తే ఓటమి భయం పట్టుకుందన్నారు. అస్తవ్యస్త, దిక్కుమాలిన పాలనతో ప్రజ ల్లో తిరుగుబాటు వస్తుందని ఊహించలేదా అని ప్రశ్నించారు. దేశంలో రాష్ర్టాన్ని 29వ స్థానంలోకి దిగజార్చడని అన్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాడన్నారు.

ఏలూరు టూటౌన్‌: వైసీపీ ఓటమి ఖయమని నిర్థారణ కావడంతో జగన్‌ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం 15వ డివిజన్‌లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలు ప్రజలకు వివరించారు. ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

చరమాంకంలో జగన్‌రెడ్డి రాజకీయ జీవితం

పెదవేగి: జగన్‌రెడ్డి రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని, వచ్చే ఎన్నికల్లో వైసీ పీ ఇంటికి పోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్‌ అన్నారు. అమ్మపాలెంలో శుక్ర వారం బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించా రు. ఇంటింటికి తిరిగి భవిష్యత్‌ గ్యారంటీపై టీడీపీ ముద్రించిన గ్యారంటీ పత్రాన్ని అందించారు. అవినీతి, అక్రమాలతో నిండిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి జనం సిద్దంగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రాభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుందని, ఆరోజున జగన్‌ జైలుకే పోతా డని ప్రభాకర్‌ చెప్పారు. తాతా సత్యనారాయణ, చందు శ్రీను, వీరయ్య, మురళి, జ్యోతి, ఏసుపాదం, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 12:22 AM

Advertising
Advertising