ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బటన్‌ నొక్కారు..సొమ్ములేవి ?

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:55 PM

ఈనెల 23న నాల్గొ విడదత ఆసరా సొమ్ములు విడుదల చేసేందుకు సభ పెట్టి సీఎం సార్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటికీ ఒక్క గ్రూపునకు కూడా సొమ్ము పడితే ఒట్టు..

ఆసరా కోసం మహిళల ఎదురు చూపులు

నాల్గో విడత ఒక్క రూపాయి పడలేదు

గతేడాది మూడో విడతలో మూడు నెలలు వేశారు

భీమవరం రూరల్‌, జనవరి 28 : సార్‌ బటన్‌ అయితే నొక్కారు. సొమ్ములు ఎప్పుడు పడతాయో అని లబ్ధిదారులు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఈనెల 23న నాల్గొ విడదత ఆసరా సొమ్ములు విడుదల చేసేందుకు సభ పెట్టి సీఎం సార్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటికీ ఒక్క గ్రూపునకు కూడా సొమ్ము పడితే ఒట్టు.. జిల్లాలో 27,004 గ్రూపులకు రూ.275.90 కోట్లు విడుదల అయింది. ఆసరా సొమ్ముల కోసం నెలరోజుల ముందుగానే డ్వాక్రా మహిళలచే వేలిముద్రలు వేయించుకున్నారు. ఇప్పుడు సొమ్ముల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్నారు. గడిచిన సంవత్సరం 3వ విడత సొమ్ము 27,013 గ్రూపులకు గాను రూ. 276 కోట్లు బటన్‌ నొక్కి విడుదల చేశారు. మూడు నెలలు వరకు గ్రూపుల వారీగా వేస్తూనే ఉన్నారు. సొమ్ము చెల్లింపులో కార్పొరేషన్‌ వారీగా ఎస్సీ, ఎస్టీ ముందుగా వేయడం, బీసీ రెండో లిస్టుగా, ఓసీ చివరిగా వేశారు. ఈసారి నాల్గో విడత కూడా అదే లెక్కన కార్పొరేషన్‌ల వారీగానే వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల సమయం దగ్గరవడంతో ఎన్నికల ముందు రోజులలో వేయడానికి ప్రణాళిక.. అనే ప్రచారం సాగుతుంది. అయితే వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం అమలులో మహిళలు లబ్ధి ఎలా ఉన్నా విమర్శలు వెల్లువెత్తాయి. పథకం ద్వారా లబ్ధిపొందే మహిళలకు సమానంగా కాకుండా వ్యత్యాసం ఒక్క గ్రూపుకు అత్యల్పంగా సొమ్ము వందలు, కొన్ని గ్రూపుల మహిళలకు రూ.రెండు వేలు, మూడు వేలు, కొంత మందికే రుణాల సొమ్ములో 80 శాతం వరకు లాభించడంతో మహిళలలో నిరుత్సాహం ఎక్కువ ఉంది. సొమ్ము పొందడంలో జాప్యం, వేలిముద్రలు, పోటోలు హడావిడి డ్వాక్రా లీడర్‌ల చేతివాటం ఇవన్నీ ఆసరా.. ఇచ్చిందిలే.. అనే మాటలే వినిపిస్తున్నాయి. చివరికి ఆసరా ఫెయిల్‌నా అనేలా మారింది.

Updated Date - Jan 28 , 2024 | 11:55 PM

Advertising
Advertising