ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్పుడే కట..కట

ABN, Publish Date - Feb 05 , 2024 | 12:07 AM

వేసవి వచ్చేస్తున్నది. నీటి వినియోగం పెరుగుతుంది. అప్పుడు మంచినీటికి మరింత కటకట లాడే పరిస్థితి తలెత్తనుంది. మోటార్లకు కూడా మంచినీరు అందే పరిస్థితి ఉండడం లేదు.

మంచినీటి సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం

భీమవరం, తాడేపల్లిగూడెంలో

సరఫరా సమయంలో విద్యుత్‌ కోతలు

మోటార్లు ఉన్నాయంటూ మెలిక

వేసవిలో మరింత దుర్భరం

అమృత్‌ ప్రాజెక్ట్‌లు అమలులో విఫలం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వేసవి వచ్చేస్తున్నది. నీటి వినియోగం పెరుగుతుంది. అప్పుడు మంచినీటికి మరింత కటకట లాడే పరిస్థితి తలెత్తనుంది. మోటార్లకు కూడా మంచినీరు అందే పరిస్థితి ఉండడం లేదు. బోరుబావుల్లో లభించే ఉప్పునీటిని వినియో గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గతంలో పుష్కలంగా మంచినీరు అందించేవారు. వేసవిలో అయితే మూడు పూటలా మంచినీరు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకునేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షా కాలంలోనూ విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. వేసవిలో అయితే శివారు ప్రాంతాలకు గుక్కెడు మంచినీళ్లు సరఫరా అయ్యే అవకాశం లేకుండా పోతోంది.

సరఫరా వేళల్లో కోతలు

పట్టణాలకు మంచినీటి సరఫరాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో విద్యుత్‌ కోతలే అందుకు నిదర్శనం. మంచినీరు సరఫరా చేసే సమయంలో రెండు పట్టణాల్లోనూ విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. భీమవరంలో ఉదయం పూర్తిగా కోతలు విధిస్తున్నారు. సాయంత్రం సమయంలో సరఫరా చేసినప్పుడే విద్యుత్‌ సరఫరా ఉంటోంది. తాడేపల్లిగూడెం పట్టణంలో అయితే రెండు పూటలా కోతలు అమలు చేస్తున్నారు. మంచినీరు సమృద్ధిగా సరపరా చేసేందుకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పాలకవర్గాలు లేకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. మంచినీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదు. కేంద్రం అమలు చేస్తున్న అమృత్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేకపోయారు. ఫలితంగా పట్టణాల్లో మంచినీటి కొరత ఏర్పడుతోంది. ప్రతి ఇంటికి మోటార్లు ఉండడం వల్లే విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నామంటూ అధికారులు కొత్త భాష్యం చెపుతున్నారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లో కోతలు అమలు చేయడం లేదు. ఆ పట్టణాల్లోనూ ఇళ్లకు మోటార్లు ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ 75 శాతం ఆవాసాలకు మోటార్లు వినియోగిస్తున్నారు. వారంతా మంచినీటి సరఫరా సమయంలో మోటార్లు ద్వారా మున్సిపాలిటీ మంచినీటిని ట్యాంక్‌ల్లో నింపుకుంటున్నారు. ఏ పాలకవర్గంలోనూ విద్యుత్‌ కోతలు అమలు చేయలేదు. అవసరమైన చోటకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు.

అమృత్‌ ప్రాజెక్ట్‌ల అమలులోనూ జాప్యం

తెలుగుదేశం హయాంలో మంజూరైన అమృత్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలోనూ ఇప్పటి ప్రభుత్వం విఫలమైంది. పట్టణాల్లో మంచినీటి సరఫరా కోసం తొలి విడత అమృత్‌ ప్రాజెక్ట్‌లో నిధులు కేటాయించారు. అలాగే అప్పట్లోనే తాడేపల్లిగూడెంలో రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి ప్రణాళికలు చేశారు. అమృత్‌లో నిధులు మంజూరయ్యాయి. అదే ప్రాజెక్ట్‌లను ఇప్పుడు అమృత్‌ 2.0లో మరోసారి మంజూరు చేయించారు. గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ చేతులెత్తేయడంతో రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దానినే మళ్లీ అమృత్‌ 2.0లో మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 250 కోట్లు విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. భీమవరం, తాడేపల్లిగూడెంలోనే సుమారు రూ. 200 కోట్ల విలువైన పనులు నిర్వహించాలి. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఆ మొత్తం నిధులు వెచ్చించాలి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు ఇవ్వలేదు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ రానుంది. ఆ తర్వాత అనుమతులు ఇవ్వడానికి వీలు లేదు. ఆ ప్రాజెక్ట్‌లపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.

రిజర్వాయర్‌పై పట్టించుకోని అధికారులు

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్‌ పూర్తిగా నాశనమైంది. పైకప్పు ఊడిపోయింది. దానికి మరమ్మతులు చేపట్టలేక పోతున్నారు. ట్యాంక్‌లో పక్షులు రెట్టలు వేస్తున్నాయి. పురుగులు పడుతున్నాయి. అదే ట్యాంక్‌ నుంచి పట్టణ ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అంతే తప్పా పైకప్పును పూడ్చే ప్రయత్నం చేయడం లేదు. పట్టణంలో సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఽశివారు ప్రాంతాలకు మంచినీటిని అందిస్తున్నాం అంటూ అధికారులు లెక్కకు మిక్కిలి గొప్పలు చెప్పుకొంటున్నారు. అంతే తప్పా ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ మరమ్మతులు చేసేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదు.

Updated Date - Feb 05 , 2024 | 12:07 AM

Advertising
Advertising