కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

ABN, Publish Date - Jan 06 , 2024 | 04:46 PM

మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!
2000 Notes Exchange Updates

ముంబై, జనవరి 06: మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రూ. 2 వేల నోట్లను రిటర్న్ చేసేందుకు ఆర్బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది.

ఆర్బీఐ అనుమతించిన 19 కార్యాలయాల్లో దేనికైనా ఏదైనా పోస్టాఫిస్ నుంచి నోట్లను పంపవచ్చునని ఆర్బీఐ తెలిపింది. అయితే, ప్రజలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌లను పూరించి, పోస్టాఫిస్ నుంచి ఆ నోట్లను ఆర్బీఐ ధృవీకృత కార్యాలయానికి పంపించాలని ప్రకటనలో పేర్కొంది. నోట్ల మార్పిడీ కోసం ఆర్బీఐ ఇష్యూ చేసిన 19 కార్యాలయాలు ఇవే. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జమ్ము, జైపూర్, కోల్‌కతా, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాల్లోని ఆర్‌బీఐ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చు.

కాగా, 2016లో డీమోనిటైజేషన్ తర్వాత తొలిసారిగా రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోట్లను కూడా ఉపసంహరించుకోనున్నట్లు గత ఏడాది మే నెలలో అపెక్స్ బ్యాంక్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇవి పెద్దగా ఉపయోగంలో లేవని, వీటి జీవితకాలం కూడా ముగిసిపోయిందని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మే 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 97.38 శాతానికి పైగా తిరిగి వచ్చాయని ప్రకటించింది ఆర్బీఐ. ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి అవకాశం కల్పించింది. బ్యాంకుల్లో మార్పిడీకి అవకాశం ముగిసిన తరువాత.. పోస్టాఫిస్ ఆధారిత సౌకర్యాలతో పాటు.. 19 ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు అని ప్రకటించింది ఆర్బీఐ.

Updated Date - Jan 06 , 2024 | 04:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising