ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కెనరా బ్యాంక్‌ లాభం 3,659 కోట్లు

ABN, Publish Date - Jan 25 , 2024 | 04:37 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కెనరా బ్యాంక్‌ నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.3,659 కోట్లకు చేరుకుంది. రుణ వ్యయాలు తగ్గడంతోపాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది...

రూ.9,417 కోట్లకు పెరిగిన వడ్డీ ఆదాయం.. గణనీయంగా తగ్గిన మొండి బకాయిలు

ముంబై: వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కెనరా బ్యాంక్‌ నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.3,659 కోట్లకు చేరుకుంది. రుణ వ్యయాలు తగ్గడంతోపాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 9.50 శాతం వృద్ధితో రూ.9,417 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 0.09 శాతం పెరిగి 3.02 శాతంగా నమోదైంది. కాగా, రుణ వ్యయం 0.24 శాతం తగ్గి 0.97 శాతానికి పరిమితమైందని కెనరా బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కే సత్యనారాయణ రాజు తెలిపారు. బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతోపాటు మొండిబకాయిలు గణనీయంగా తగ్గడం లాభంలో బలమైన వృద్ధికి దోహదపడిందన్నారు. మరిన్ని విషయాలు..

  • డిసెంబరు చివరినాటికి మొండి బకాయిలు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 1.50 శాతం తగ్గి 3.39 శాతానికి జారుకున్నాయి. నికర ఎన్‌పీఏలు 0.64 శాతం తగ్గి 1.32 శాతానికి తగ్గాయి.

  • బ్యాంక్‌ ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి 2.69 శాతం పెరిగి 89.01 శాతానికి పుంజుకుంది. దాంతో కీలక మూలధన నిష్పత్తి 15.78 శాతానికి మెరుగుపడింది.

  • గడిచిన త్రైమాసికానికి బ్యాంక్‌ రుణ వృద్ధి 9.7 శాతంగా, డిపాజిట్లలో వృద్ధి 12.5 శాతంగా నమోదైంది.

  • రిటైల్‌ రుణాలు 12.14 శాతం, పంట రుణాలు 19.26 శాతం, ఎంఎ్‌సఎంఈ రుణాలు 10 శాతం, గృహ రుణాలు 12.07 శాతం, వాహన రుణాలు 13.2 శాతం పెరిగాయి.

  • బ్యాంక్‌ వ్యక్తిగత రుణాల మంజూరు రూ.9,100 కోట్లుగా నమోదైంది. అందులో మొండిబాకీల వాటా 1.2 శాతం ఉందని బ్యాంక్‌ తెలిపింది. హోమ్‌ లోన్లు రూ.91,800 కోట్లు, వాహన రుణాలు రూ.16,960 కోట్లకు పెరిగాయి.

  • ఉద్యోగుల వేతనాలు, రిటైర్మెంట్‌, ఇతర ప్రయోజనాల కోసం రూ.7,000 కోట్లు పక్కన పెట్టడం జరిగిందన్నారు.

  • క్యూ3 చివరినాటికి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంక్‌ రుణాలు రూ.1,35,000 కోట్లుగా నమోదయ్యాయి.

  • గడిచిన మూడు నెలల్లో కొత్తగా రూ.3,000 కోట్ల రుణాలు మొండి పద్దుల్లోకి చేరాయి. అందులో చాలావరకు ఖాతాలు రిటైల్‌, అగ్రి, ఎంఎస్‌ఎంఈ రుణాలకు చెందినవే. కాగా, గత త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.16,051 కోట్ల మొండి బాకీలను తిరిగి రాబట్టుకోగలిగింది.

  • బ్యాంక్‌ అంతర్జాతీయ వ్యాపారం 9.87 శాతం వృద్ధితో రూ.22,13,360 కోట్లకు చేరుకుంది. అందులో రుణాలు 11.69 శాతం వృద్ధితో రూ.9,50,430 కోట్లుగా, డిపాజిట్లు రూ.12,62,930 కోట్లుగా నమోదయ్యాయి.

  • దేశీయంగా డిపాజిట్లు 8.07 శాతం పెరుగుదలతో రూ.11,66,848 కోట్లుగా, రుణాలు 12.56 శాతం వృద్ధితో రూ.9,01,465 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

ఐఓసీ లాభం జూమ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఇంధన విక్రయ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మూడో త్రైమాసికంలో బంపర్‌ లాభాలను ప్రకటించింది. స్టాండ్‌ అలోన్‌ నికర లాభం రూ.8,063.39 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నమోదైన రూ.448 కోట్ల లాభంతో పోలిస్తే భారీగా పుంజుకున్నప్పటికీ, గత ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,967.32 కోట్ల లాభంతో పోలిస్తే బాగా తగ్గింది. ఈ క్యూ3లో కంపెనీ రాబడి రూ.2.23 లక్షల కోట్లుగా, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం ద్వారా లభించిన స్థూల లాభం రూ.11,428.88 కోట్లుగా నమోదైంది.

టెక్‌ మహీంద్రాకు మార్జిన్ల సెగ

ముంబై: టెక్‌ మహీంద్రా క్యూ3 నికర లాభం వార్షిక ప్రాతిపదికన 60ు తగ్గి రూ.510.4 కోట్లకు జారుకుంది. లాభాల మార్జిన్లు 12 శాతం నుంచి ఏకంగా 5.4 శాతానికి తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ రూ.1,296 కోట్ల లాభం గడించింది. కాగా, ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం సైతం 4.6ు తగ్గి రూ.13,101 కోట్లకు పరిమితమైంది. గడిచిన మూడు నెలల్లో కొత్తగా 38.1 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నట్లు తెలిపింది.

Updated Date - Jan 25 , 2024 | 04:37 AM

Advertising
Advertising