ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mark Zuckerberg: ఫేస్‌బుక్‌కు 20 ఏళ్లు.. పాత వీడియోను పంచుకున్న మార్క్ జుకర్‌బర్గ్!

ABN, Publish Date - Feb 05 , 2024 | 05:49 PM

కమ్యూనికేషన్ విధానాన్ని సమూలంగా మార్చేసిన ఫేస్‌బుక్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.

ఫేస్‌బుక్ (Facebook).. సోషల్ మీడియా పరిధిని విపరీతంగా విస్తరించిన వేదిక. కమ్యూనికేషన్ విధానాన్ని సమూలంగా మార్చేసిన మాధ్యమం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి ఫేస్‌బుక్ హద్దులు దాటి ఎదుగుతూ ``మెటా`` (Meta)గా అవతరించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. ఇలా దిగ్గజ సామాజిక మాధ్యామాలన్నీ ``మెటా``` పరిధిలో పని చేస్తున్నాయి. హార్వార్డ్ డార్మ్ రూమ్‌లో 20 ఏళ్ల క్రితం ఫేస్‌బుక్ రూపుదిద్దుకుంది (Facebook 20th Birthday).

ఫేస్‌బుక్ పుట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జుకర్‌బర్గ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఫేస్‌బుక్ ప్రారంభించిన నాటి నుంచి దానితో సాగిన తన జర్నీకి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ``20 ఏళ్ల క్రితం నేను ఒకటి ప్రారంభించాను. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి మరింత గొప్పదాన్ని రూపొందించాం. బెస్ట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది`` అంటూ జుకర్ బర్గ్ కామెంట్ చేశారు. ఆ వీడియోలో జుకర్ ‌బర్గ్ కాలేజ్ స్టూడెంట్‌గా ఉంటూ ఫేస్‌బుక్‌ను ప్రారంభించిన దగ్గర్నుంచి.. ఒక్కో మెట్టూ ఎదుగుతున్న వైనాన్ని చూపించారు. .

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.4 లక్షల మంది కంటే పైగా ఈ వీడియోను లైక్ చేశారు. అద్భుతాన్ని ఆవిష్కరించిన జుకర్‌బర్గ్‌ను అందరూ ప్రశంసించారు. అంతేకాదు.. ఫేస్‌బుక్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ స్పందిస్తూ ``లవ్యూ డాడ్`` అని రిప్లై ఇచ్చింది. ఫేస్‌బుక్ ఎంతో మంది జీవితాలను మార్చిందంటూ కామెంట్లు చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 05:49 PM

Advertising
Advertising