ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 74 శాతానికి జీఎంఆర్‌ వాటా

ABN, Publish Date - Jan 28 , 2024 | 06:04 AM

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్‌ గ్రూప్‌ తన వాటాను మరో 11 శాతం పెంచుకుంది. దాంతో జీఎంఆర్‌ వాటా 63 శాతం నుంచి 74 శాతానికి పెరిగింది. మలేషియా ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ బెర్హాద్‌ (ఎంఏహెచ్‌బీ) గ్రూప్‌...

మలేషియా కంపెనీ నుంచి తాజాగా 11ు వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ.830 కోట్లు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్‌ గ్రూప్‌ తన వాటాను మరో 11 శాతం పెంచుకుంది. దాంతో జీఎంఆర్‌ వాటా 63 శాతం నుంచి 74 శాతానికి పెరిగింది. మలేషియా ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ బెర్హాద్‌ (ఎంఏహెచ్‌బీ) గ్రూప్‌ నుంచి ఈ వాటాను 10 కోట్ల డాలర్లకు (రూ.830 కోట్లు) చేజిక్కించుకుంది. దీంతో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి మలేషియా గ్రూప్‌ పూర్తిగా వైదొలిగినట్లయిందని జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ తెలిపింది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)లో 11 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ఎంఏహెచ్‌బీ, అనుబంధ సంస్థ ఎంఏహెచ్‌బీ (మారిషస్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌) గత ఏడాది అక్టోబరు 25న షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, హైదరాబాద్‌ విమానాశ్రయంలోని మిగతా 26 శాతం వాటాలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), తెలంగాణ ప్రభుత్వం చెరో 13 శాతం కలిగి ఉన్నాయి.

Updated Date - Jan 28 , 2024 | 06:55 AM

Advertising
Advertising