వివో నుంచి ప్రీమియం ఫోన్ ఎక్స్ 100
ABN, Publish Date - Jan 05 , 2024 | 06:31 AM
స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో మార్కెట్లోకి ప్రీమియం విభాగంలో వివో ఎక్స్ 100 సీరీస్ హ్యాండ్‌సెట్లు విడుదల చేసింది. వీటి ధర రూ.63,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం ఫోన్ల విభాగంలో...
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో మార్కెట్లోకి ప్రీమియం విభాగంలో వివో ఎక్స్ 100 సీరీస్ హ్యాండ్‌సెట్లు విడుదల చేసింది. వీటి ధర రూ.63,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం ఫోన్ల విభాగంలో తమ స్థానం పటిష్ఠం చేసుకునే లక్ష్యంతో వీటిని మార్కెట్లోకి తెచ్చినట్టు వివో ప్రకటించింది. కస్టమర్లకు అద్భుతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని కలిగించాలన్న తమ ప్రయత్నానికి ఈ ఎక్స్ సీరీస్ ఫోన్లు ఆలంబనగా నిలుస్తాయని కంపెనీ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వికాస్ తగ్రా తెలిపారు. టెలీఫొటో సన్‌షాట్ ఫీచర్ వీటి ప్రత్యేకత. ఈ ఫీచర్ కారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఇది అద్భుతంగా ఫొటో తీయగలుగుతుంది. వీటిలో ఎక్స్ 100 ప్రో హ్యాండ్‌సెట్ (16 జీబీ+512 జీబీ) ధర రూ.89,999 కాగా 12 జీబీ+256 జీబీ సామర్థ్యం గల ఎక్స్ 100 వేరియెంట్ ధర రూ.63,999. 16జీబీ+512 జీబీ సామర్థ్యం గల ఎక్స్ 100 వేరియెంట్ ధర రూ.69,999.
Updated Date - Jan 05 , 2024 | 06:31 AM