Bank Holidays: దయచేసి వినండి.. ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవుదినాలు ఇవేనండి..
ABN, Publish Date - Jan 27 , 2024 | 11:26 AM
జనవరి నెల ముగిసి ఫిబ్రవరి రాబోతోంది. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో బ్యాంక్ కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని త్వరగా పూర్తిచేసుకోవడం ఉత్తమం.
జనవరి నెల ముగిసి ఫిబ్రవరి రాబోతోంది. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో బ్యాంక్ కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని త్వరగా పూర్తిచేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 18 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. పండుగలు, శని, ఆదివారాలు కలుపుకుని మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఫిబ్రవరి 4 ఆదివారం, ఫిబ్రవరి 10 రెండో శనివారంతో పాటు గ్యాంగ్ టక్ లో జరుపుకునే లోనర్ పండుగ, ఫిబ్రవరి 11 ఆదివారం, ఫిబ్రవరి 14 న వసంత పంచమి సందర్భంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటాయి. ఫిబ్రవరి 18 ఆదివారం, ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి, ఫిబ్రవరి 20 అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 24వ తేదీ నాలుగో శనివారం, ఫిబ్రవరి 25న ఆదివారం, ఫిబ్రవరి 26న న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు మాత్రమే సెలవు ఉంటుంది. మిగతా చోట్ల బ్యాంకులు యథావిధిగా సేవలు అందిస్తాయి. అయితే.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అందిస్తోంది. ఈ సెలవుల పూర్తి జాబితాను ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. ఈ క్రమంలో ఆన్ లైన్ ద్వారా సెలవు దినాల్లోనూ బ్యాంకు సేవలు వినియోగించేలా చేయడం కొంత ఉపశమనం కలిగించే విషయం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 27 , 2024 | 11:26 AM