Jio: ఈ జియో ప్లాన్స్‌లో డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు చెల్లించక్కర్లేదు
ABN, Publish Date - Mar 03 , 2024 | 08:15 PM
రిలయన్స్ జియో(Reliance Jio).. భారత్‌లోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. 44 కోట్లకుపైగా వినియోగదారులను జియో కలిగి ఉంది. తక్కువ ధరలకే సరమైన ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అనేక ఆఫర్‌లతో యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను లాంచ్ చేస్తున్నందున యూజర్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు
ఢిల్లీ: రిలయన్స్ జియో(Reliance Jio).. భారత్‌లోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. 44 కోట్లకుపైగా వినియోగదారులను జియో కలిగి ఉంది. తక్కువ ధరలకే సరమైన ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అనేక ఆఫర్‌లతో యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను లాంచ్ చేస్తున్నందున యూజర్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు. Jioలో యానువల్, వినోదం, డేటా బూస్టర్‌లు, డేటా ప్యాక్‌లు, 5G అప్‌గ్రేడ్ వంటి అనేక ప్లాన్‌లు ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఏదైనా ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. జియోలోని రెండు పవర్ ప్యాక్డ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం..
రూ. 758 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, OTTని, 126GB డేటాని అందిస్తుంది. రోజుకు 1.5GB డేటాను వాడుకోవచ్చు. రోజువారీ డేటా ప్యాక్ అయిపోతే 100 SMS పంపే సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఎస్ఎంఎస్ ద్వారా ఇతరులతో కనెక్ట్ కావచ్చు. ఈ ప్లాన్ OTT సబ్‌స్క్రిప్షన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో వస్తుంది. సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి.
రూ.666 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజులపాటు ఉంటుంది. అపరిమిత కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. మొత్తం 126GB డేటాను కలిగి ఉంటుంది. రోజుకు 1.5GB డేటాను ఉపయోగించవచ్చు. Jio రోజుకు 100 SMSలు, ఏ రకమైన OTT యాప్‌కైనా ఫ్రీ సబ్‌స్క్రీప్షన్ అందిస్తుంది. మీరు 5G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంటే ఇదే ప్లాన్‌లో అపరిమిత 5G డేటాను ఉపయోగించవచ్చు.
Updated Date - Mar 03 , 2024 | 08:23 PM