ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే పదేళ్లలో ట్రిలియనీర్‌

ABN, Publish Date - Jan 17 , 2024 | 05:52 AM

ప్రపంచ టాప్‌ టెన్‌ కుబేరుల్లో ఐదుగురి సంపద గత మూడేళ్లలో రెట్టింపైందని.. ప్రస్తుత బిలియనీర్ల ప్రపంచం పదేళ్లలో తొలి ట్రిలియనీర్‌నూ చూడనుందని అంతర్జాతీయ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక...

గడిచిన మూడేళ్లలో ఐదుగురు ప్రపంచ కుబేరుల సంపద రెట్టింపు

  • 500 కోట్ల మంది పేదరికంలోకి..

  • ప్రపంచంలో ఆర్థిక అసమానతలపై డబ్ల్యూఈఎ్‌ఫలో ఆక్స్‌ఫామ్‌ నివేదిక

దావోస్‌: ప్రపంచ టాప్‌ టెన్‌ కుబేరుల్లో ఐదుగురి సంపద గత మూడేళ్లలో రెట్టింపైందని.. ప్రస్తుత బిలియనీర్ల ప్రపంచం పదేళ్లలో తొలి ట్రిలియనీర్‌నూ చూడనుందని అంతర్జాతీయ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక పేర్కొంది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, కార్పొరేట్ల అర్థ బలంపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో ఈ రిపోర్టును విడుదల చేసింది. టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌, ఎల్‌వీఎంహెచ్‌ గ్రూప్‌ అధిపతి బెర్నార్డ్‌ అర్నో, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, ఒరాకిల్‌ ఫౌండర్‌ ల్యారీ ఎల్లిసన్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ల మొత్తం సంపద 2020 మార్చిలో 40,500 కోట్ల డాలర్లుగా ఉండగా.. 2023 నవంబరు నాటికి 86,900 కోట్ల డాలర్లకు పెరిగిందని నివేదిక తెలిపింది. అంటే.. వీరి మొత్తం సంపద గంటకు 1.4 కోట్ల డాలర్ల చొప్పున పెరిగింది. కాగా, ఆర్థిక అంతరాలు వేగంగా పెరగుతున్న ఈ దశాబ్దంలో దాదాపు 500 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని రిపోర్టు తెలిపింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, వచ్చే దశాబ్ద కాలంలో ఎవరో ఒకరు ట్రిలియన్‌ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు) అధిపతిగా అవతరించవచ్చని.. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు మరో 229 ఏళ్లు పట్టవచ్చని ఆక్స్‌ఫామ్‌ అంటోంది. ప్రపంచంలో నం.1 ధనికుడు ఎలాన్‌ మస్క్‌ ప్రస్తుత సంపద 20,600 కోట్ల డాలర్లుగా ఉంది.

నివేదికలోని మరిన్ని విషయాలు..

ప్రపంచంలోని టాప్‌ టెన్‌ కంపెనీల్లో ఏడింటి సీఈఓ లేదా ప్రధాన షేర్‌హోల్డర్‌ బిలియనీర్‌ (కనీసం 100 కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన వారు)గా ఉన్నారు. ఈ కంపెనీల మొత్తం విలువ 10.2 లక్షల కోట్ల డాలర్లు. అనగా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలన్నింటి జీడీపీ కంటే అధికం.

ప్రపంచంలోని 148 అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు మొత్తం 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభా లు ఆర్జించాయి. వీటి లాభాల మూడేళ్ల సగటు 52 శాతం పెరిగింది. ఈ కంపెనీలు తమ వాటాదారులకు భారీగా రిటర్నులు పంచిపెట్టాయి. కానీ, ప్రపంచంలో కోట్లాది మంది ఉద్యోగుల జీతాలు మాత్రం పెరిగిన ధరలు, వ్యయ భారాలకు అనుగుణంగా పెరగలేదు.

ప్రపంచ జనాభాలో కేవలం 21 శాతం కలిగిన ఉత్తర ధనిక దేశాల చేతుల్లోనే 69 శాతం సంపద ఉంది. ప్రపంచ బిలియనీర్లలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారే.

Updated Date - Jan 17 , 2024 | 05:52 AM

Advertising
Advertising