ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధించింది.. అసలు కారణాలేంటి?

ABN, Publish Date - Feb 01 , 2024 | 05:35 PM

బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొత్త కస్టమర్లను జత చేసుకోవద్దని, వాలెట్లలో డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొత్త కస్టమర్లను జత చేసుకోవద్దని, వాలెట్లలో డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ-పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయకూడదని స్పష్టం చేసింది.


దీంతో.. పేటీఎంపై ఆర్బీఐ ఈ ఆంక్షలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇందుకు కారణం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని నిబంసధనలను ఉల్లంఘించడమే. దీనికితోడు.. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, బయటి ఆడిటర్లు దీని కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదికలో భాగంగా పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని తేలింది. మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ వివరించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

ఈ ఆంక్షలపై పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (ఓసీఎల్) వివరణ ఇస్తూ.. ఆర్థిక సేవల సంస్థగా తాము కస్టమర్లకు వివిధ చెల్లింపుల సాధనాలను అందిస్తున్నామని, అందుకోసం పేటీఎం పేమెంట్స్ సహా పలు బ్యాంకులతో కలిసి పని చేస్తున్నామని తెలిపింది. తాజా ఆంక్షల నేపథ్యంలో తమ పథకాలు, ప్లాన్స్‌ని ఇతర భాగస్వామ్య బ్యాంకులకు బదిలీ చేస్తామని పేర్కొంది. ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తామని వెల్లడించింది. అటు.. ఈ ఆంక్షల వల్ల తమ వార్షిక కార్యకలాపాల లాభంపై రూ.500 కోట్ల మేర ప్రభావం ఉంటుందని పీపీబీఎల్ చెప్పుకొచ్చింది.

Updated Date - Feb 01 , 2024 | 05:35 PM

Advertising
Advertising