ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maha Shivaratri 2024 : శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటి.. ! అసలు ఎందుకు చేయాలి.

ABN, Publish Date - Mar 07 , 2024 | 11:42 AM

కోరిన కోరిక సాధించుకునే విషయంలో శివుడు అండగా ఉంటాడనే నమ్మకం ఇది. ఇదే నమ్మకం శరీరంలో బలం, మానసిక బలం, సంకల్పాన్ని కలిపి ఇస్తుంది.

Sivaratri

శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి మహా పర్వదినాన ఆ దేవ దేవుని కరుణా కటాక్షాలను పొందేందుకు శివ మహా దేవుని ఆరాధన, జాగరణ చేస్తాం. అయితే ఇవి అన్నీ భక్తిని తెలుపుకునేందుకు గల మార్గాలు. ప్రతి శివాలయంలోనూ భక్తులు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజున భక్తులు జాగరణ చేయడానికి ఉపక్రమిస్తారు. సాయంత్రం వరకూ శివుని ఆరాధించి, పూజించి, సాయంత్రం తరువాత స్వామి స్మరణలో రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణకు కూర్చుంటారు. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి, కీర్తిస్తారు. మహాశివరాత్రి రోజున కోరిన వరాన్ని ఇచ్చే రాత్రి ఈ మహా శివరాత్రి నిష్టతో ఆచరించే భక్తులకు కోరిన ప్రతి కోరికా తీరుతుందనే నమ్మకం.

ఆరాధన, ఉపవాసం, జాగరణ వంటివి మనస్సుమీద, శరీరం మీద ఏకాగ్రతను పెంచుతాయి. మనస్సు నిర్మలత్వంతో భక్తిలో మునిగిపోతుంది. మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలచుకుంటూ శివ మంత్రాలు, శివపురాణాలు పఠిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని నమ్ముతారు.

ఇలా మెలకువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా?

కోరిన కోరిక సాధించుకునే విషయంలో శివుడు అండగా ఉంటాడనే నమ్మకం ఇది. ఇదే నమ్మకం శరీరంలో బలం, మానసిక బలం, సంకల్పాన్ని కలిపి ఇస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహమే అందుకు కారణమని ఆధ్యాత్మిక పెద్దలు బోధిస్తుంటారు. శివుని శివరాత్రి రోజున మనసారా పూజిస్తే.. ఉపవాసం తరువాత రాత్రికి ధ్యానంలో వెన్నెముకను సరళ రేఖలో ఉంచడం శక్తిని పెరిగేలా చేస్తుంది. దీనితో శరీరం, మనస్సు శక్తి స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ శక్తి పెరుగుదల శాంతి, మోక్ష జీవితాన్ని పొందవచ్చు.

మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది. మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు, గ్రహాల అమరిక కుండలినీ శక్తి వలె మన ప్రాణశక్తిని పెంచుతుంది. యోగులు, మునులు చాలా మంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ముక్తిని పొందారు.

ఇది కూడా చదవండి: శివరాత్రికి ముస్తాబుకానున్న ప్రసిద్ధ దేవాలయాలు ఇవే..!


ఎన్నో అద్భుతాలు చేయగల రాత్రి ఇది..

శివరాత్రి అనేది సంవత్సరంలో ఒక రోజు మాత్రమే కాదు.. శివరాత్రి ప్రతి నెలలో ఒక రోజు వస్తుంది. అది అమావాస్య ముందు రోజు అవుతుంది. అమావాస్య కంటే శివరాత్రి రోజు చీకటిగా ఉంటుంది. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రిలలో అత్యంత శక్తివంతమైనది మార్చిలో వచ్చే శివరాత్రి. అందుకే మహాశివరాత్రి అంటాం.

లోతైన అర్థం దాగి ఉంది..

సాధారణంగా శివరాత్రిని రాత్రిపూట జరుపుకుంటాం. మనం చీకట్లో ఎందుకు జాగరణ ఉండాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చీకటి అనేది చీకటిలోనే ఈ ప్రపంచం నిర్మితమైందని అర్థం చేసుకోవాలి. మారుతున్న కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుండి పుట్టినవే. అలాంటి శూన్యాన్ని మనం శివునిగా పూజిస్తాం, ఆరాధిస్తాం. దీన్ని అర్థం చేసుకోవడం వల్ల మనస్సు ఆనందం, సంతోషం అనే భావనలకు లోనవుతుంది.

ఇవి కూడా చదవండి:

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

Updated Date - Mar 07 , 2024 | 11:42 AM

Advertising
Advertising