ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైకు

ABN, Publish Date - Jan 01 , 2024 | 03:40 AM

రాలుతున్న తుహిన కణాలతో ఈ నశ్వర ప్రపంచం - కడగాలని వుంది...

రాలుతున్న తుహిన కణాలతో

ఈ నశ్వర ప్రపంచం -

కడగాలని వుంది

బషో (జపాన్‌)

పుట్టగానే స్నానం

చావగానే స్నానం -

ఎంత మూర్ఖం

ఇస్సా (జపాన్‌)

హేమంత రాత్రి -

సాలెపురుగును చంపాక

నేనెంత ఏకాకిని

షికి (జపాన్‌)

సముద్ర తీరంలో

తలతిప్పి చూస్తే -

నా పాదముద్రలేవీ లేవు

హొసయ్‌ ఒజకి (జపాన్‌)

ఖాళీ రేవులో

చంద్రునితో -

నౌక మౌన సంభాషణ

చక్‌ బ్రిక్లీ (అమెరికా)

వేసవి రాత్రి

దీపాలన్నీ ఆర్పేసాం -

వర్షపుసడి వినడానికి

పెన్నీ హార్టర్‌ (అమెరికా)

ఆస్పత్రి కిటికీల గుండా

నొప్పి మాయమౌతోంది -

చెర్రీలు వికసిస్తూ

అమితవదాస్‌ గుప్తా (ఇండియా)

ఆలయ శిథిలాలు -

గాలి మాత్రమే ఇంకా

పూలు సమర్పిస్తోంది.

రోహిణీ గుప్తా (ఇండియా)

కరెంటు కోత -

ఈ రోజు

పక్షుల కిలకిలలు విన్నాను

- ఉషా కిరణ్‌ (ఇండియా)

జైలులో కవి -

అక్కడున్నది అతని నీడే..

అతనున్నది ప్రజల మధ్య

అజిమ్‌ విన్కా (మెసడోనియా)

అనువాదం: పి. శ్రీనివాస్‌ గౌడ్‌

99494 29449

Updated Date - Jan 01 , 2024 | 03:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising