ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hair Keratin: జుట్టుకు మ్యాజిక్ చేసే హెయిర్ కెరాటిన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!

ABN, Publish Date - Feb 29 , 2024 | 05:40 PM

జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ సింపుల్ టిప్ తో పరిష్కరించుకోవచ్చు.

జుట్టు సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుండ్రు, జుట్టు చివర్లు పొడిబారడం, జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లడం, జుట్టు సున్నితంగా మారిపోవడం వంటి సమస్యలు ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. కెరాటిన్ ట్రీట్మెంట్ ద్వారా వీటిని చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే జుట్టుకు కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇదెలా ఇవ్వాలో.. దీన్ని ఎలా తయారుచేసుకోవాలో.. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

కెరాటిన్..

ఇంట్లోనే అవిసె గింజలు, బియ్యం, అలోవెరా జెల్ ఉపయోగించి కెరాటిన్ జెల్ తయారుచేయవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలంటే..

అరకప్పు బియ్యం, అరకప్పు అవిసె గింజలను ఒక పాత్రలో తీసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. తక్కువ మంట మీద 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. తెల్లటి బురుగు కనిపించినప్పుడు, అవిసె గింజలు జిగటగా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఫిల్టర్ చేయాలి. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు.

తాజా కలబంద గుజ్జును తీసి అవిసె గింజలు, బియ్యం మిశ్రమంతో మెత్తగా ప్యాక్ లాగా తయారుచేసుకోవాలి.

హెయిర్ మాస్క్‌ని స్కాల్ప్, హెయిర్ రూట్స్, జుట్టు మొత్తం పొడవునా అప్లై చేయాలి. గంట సేపాగి గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేసుకోవాలి.

ఈ ప్యాక్‌ని మొదటిసారి అప్లై చేయడం వల్ల జుట్టులో చాలా తేడా కనిపిస్తుంది. వారానికి ఒకసారి లేదా సమయం దొరికినప్పుడల్లా ఈ మాస్క్‌ను అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: 40ఏళ్లలోనూ 18ఏళ్లలా గ్లో కావాలా? ఈ టిప్స్ పాటించి చూడండి!


బెనిఫిట్స్ ఏంటంటే..

బియ్యంలో అమైనో ఆమ్లాలు, విటమిన్-ఇ, బి వంటి మాత్రమే కాకుండా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, చక్కెరను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. అలోవెరా జుట్టు క్యూటికల్స్ కు ఓదార్పు ఇస్తుంది. ఈ మూడు కలిసి జుట్టును అద్భుతంగా రిపేర్ చేస్తాయి.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే పొరపాటున కూడా తినకూడని 5 రకాల పండ్లు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 05:40 PM

Advertising
Advertising