Health Tips: 60 లోనూ 20లా కనిపించాలా? జస్ట్ వీటిని పాటిస్తే యంగ్‌గా ఉంటారు!
ABN, Publish Date - Jan 07 , 2024 | 05:48 PM
60 ఏళ్ల వయస్సులో కూడా కొందరు నవ యవ్వనంగా కనిపిస్తుంటారు. మరి వారు అంత యంగ్‌గా కనిపించడానికి కారణం ఏంటి? మీరు కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే మ్యాజిక్ లాగా పనిచేసే ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించాల్సిందే.
Health Tips: 60 ఏళ్ల వయస్సులో కూడా కొందరు నవ యవ్వనంగా కనిపిస్తుంటారు. మరి వారు అంత యంగ్‌గా కనిపించడానికి కారణం ఏంటి? మీరు కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే మ్యాజిక్ లాగా పనిచేసే ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించాల్సిందే. ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం చేయడంతో పాటు.. చెడు అలవాట్లను నివారించాల్సి ఉంటుంది. ఇది అన్ని అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ముఖ్యంగా యవ్వనంగా ఉండటానికి, ఎక్కువ కాలం జీవించడానికి ఆస్కారం చూపుతుంది. మరి రెగ్యూలర్ లైఫ్‌స్టైల్‌లో పాటించాల్సిన అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..
వాకింగ్, వ్యాయామం..
మీరు తినే ఆహారం ఎన్ని పోషకాలు కలిగి ఉన్నప్పటికీ.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే ఫలితం ఉండదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరం ఎంత చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. అందుకే.. క్రమం తప్పకుండా నడవాలి. యోగా, ద్యానం, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి శారీరక కార్యకలాపాలు కొనసాగిస్తే.. శరీరం ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అకాల మరణం అవకాశాన్ని తగ్గిస్తుంది.
నేచురల్ ఫుడ్..
సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. సహజ సిద్ధంగా పండించిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. ఆకు కూరగాయలు, క్యాప్సికమ్, బచ్చలికూర, చిక్కుళ్లు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు మొదలైన కూరగాయలు తప్పకుండా తినాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటెంట్, కెరోటినాయిడ్స్ ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతాయి. ఇవి చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి.
పండ్లు, కూరగాయలు..
ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి తినే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను చేర్చుకోవాలి. ప్రతిరోజూ విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను తినాలి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడికి దూరంగా ఉండటానికి బెర్రీలు, బొప్పాయి, సిట్రస్ పండ్లు, బ్లాక్ బెర్రీస్ మొదలైన పండ్లను తినొచ్చు. తృణధాన్యాలు, గింజలు, చేపలు, ఆలీవ్ నూన్, చిక్కుళ్లు వంటి ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన జీవనం కోసం ఉపకరిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బుల, మధుమేహం, చిత్త వైకల్యం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.
విత్తనాలు, గింజలు..
విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి యవ్వనాన్ని కాపాడుకోవడంలో బాగా ఉపయోగపడే యాంటీఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తాలు మొదలైన వాటిని డైట్‌లో చేర్చుకుంటే మేలు జరుగుతుంది.
పాజిటివ్ ఆలోచనలు..
ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం-ఆశావహ దృక్పథంలో ఉండాలి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవితంలో ఎంత సానుకూల దృక్పథం కలిగి ఉంటే.. ఎంత ఉల్లాసంగా ఉంటే.. అంత ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు. వ్యాధులు అస్సలు ధరిచేరవు. జీవిత కాలం కూడా ఎక్కువగా ఉంటుంది.
బంధాలకు ప్రాధాన్యత..
బంధాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఒంటరితనాన్ని దరిచేరనివ్వొద్దు. ఒంటరితనం ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి. ఇవి గుండె జబ్బులు, చిత్తవైకల్యం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటికీ ఆరోగ్యకరమైన సంబంధాలు కీలకం. అందుకే.. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బంధువులతో ఎక్కువ సమయం గడపాలి.
తగినంత నిద్ర..
రోజులో తగినంత నిద్రపోవడం చాలా అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. వృద్ధాప్యం దరిచేరకుండా ఉండాలంటే మంచి నిద్రపోవాలి. అర్థరాత్రి పని చేయడం, టీవీ, మొబైల్ ఫోన్లలో సమయం గడపడం మానుకోవాలి. కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయండి.
చెడు అలవాట్లు మానుకోవాలి..
ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని కలిగి ఉండటమే కాదు.. ఎక్కువ కాలం జీవించడానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. ఆల్కహాల్, సిగరెట్ల వినియోగం మానుకోవాలి. వీటికి దూరంగా ఉంటే.. ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా మీ జీవన కాలం కూడా పెరుగుతుంది.
Updated Date - Jan 07 , 2024 | 05:49 PM