ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hot Water: వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే మాత్రం జరిగేదిదే..!

ABN, Publish Date - Jan 22 , 2024 | 04:12 PM

అసలు వేడినీరు ఆరోగ్యానికి మంచిదేనా? రోజు మొత్తం వేడినీరు తాగితే ఏం జరుగుతుంది? షాకింగ్ నిజాలివీ..

వేడినీరు ఆరోగ్యానకి చాలామంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఓ గ్లాసుడు వేడినీరు తాగితే శరీరం అంతా శుద్ది అవుతుందని, శరీరంలో మలినాలు అన్నీ పోతాయని అంటారు. పైపెచ్చు వేడినీరు తాగడం వల్ల పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో వేడినీరు తాగడం మరింత అవసరం. సీజనల్ సమస్యలు అయిన జలుబు, దగ్గు, ప్లూ వంటి సమస్యలు వేడినీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీటిని ఎక్కువగా తాగితే నష్టాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

జీర్ణవ్యవస్థ, అన్నవాహికల లైనింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. వేడినీటిని ఎక్కువగా తాగితే ఈ లైనింగ్ దెబ్బతింటుంది. ఇది జీర్ణవ్యవస్థ, అన్నవాహికల సమస్యలు, వాటి పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. చాలామంది జీర్ణక్రియకు వేడినీరు ఎంతో మంచిదని అనుకుంటారు. అందుకే వేడినీటినే రోజంతా తాగుతారు. కానీ ఇది మంచిది కాదు.

ఇది కూడా చదవండి: Energy Drinks: ఎనర్జీ డ్రింక్ తాగే అలవాటుందా? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!



దాహం వేసినప్పుడల్లా వేడినీరు తాగేవారు కొందరు ఉంటారు. ఇలా పదే పదే వేడినీరు పెదవులు, నాలుక, నోటిలో తగలడం వల్ల నోటి పూత వస్తుంది.

వేడినీటిని ఎంత తాగినా అది దాహం తీర్చదు. పదే పదే మళ్లీ దాహం వేయడం స్పష్టంగా గమనించవచ్చు. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అసలే నీరు తక్కువ తాగే అలవాటు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదం. వేడినీటిని సాధారణ నీటిలా ఎక్కువ కూడా తాగలేము. ఈ కారణాల వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.

వేడినీరు చర్మాన్ని కూడా సున్నితంగా మారుస్తుంది. అందుకే వేడినీరు తాగితే పెదవులు, గొంతు చాలా తొందరగా పొడిగా మారిపోతుంది. వేడి నీరు తాగుతున్నవారిలో ఈ సమస్య కనిపిస్తే వేడినీటిని కాకుండా వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం మంచిది.

ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే వీటిని తప్పక తినాల్సిందే..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 04:12 PM

Advertising
Advertising