Mind Training: విజేతలు కావాలంటే మెదడుకూ శిక్షణ ఇవ్వాలి.. ఇదిగో ఇలా..!
ABN, Publish Date - Jan 08 , 2024 | 01:08 PM
విజయం వరించాలంటే మెదడుకు ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి.
'పరిస్థితులు బాలేవ్.. అందుకే ఓటమి పాలయ్యాను' అని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి విజయం అనేది బయటి పరిస్థితుల కంటే మనిషి మెదడు మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, లక్ష్యాలను చేరుకోవడానికి సరిగ్గా ప్లాన్ చేసుకోవడం వంటివన్నీ మెదడు సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటాయి. కానీ చాలామంది బయట విషయాలను బాగా అర్థం చేసుకుని, తమ మెదడును మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అందుకే ఎంత కష్టపడినా విజయం లభించదు. చదువుకునే పిల్లలు అయినా, ఉద్యోగస్తులు అయినా, వ్యాపారస్తులు అయినా విజయం సాధించడానికి మొదట మెదడుకు శిక్షణ ఇవ్వాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. మెదడుకు శిక్షణ ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే..
ఛాలెంజ్ లు స్వీకరించాలి..
మెదడుకు శిక్షణ ఇవ్వడంలో శక్తివంతమైన పద్దతి ఛాలెంజ్ లు స్వీకరించడం. క్లిష్టమైన పనులను ఛాలెంజ్ గా స్వీకరించి వాటిని ఓపికగా పూర్తీ చేస్తే మెదడు దృఢంగా మారుతుంది. ఇవి పెద్ద పనులే కాదు.. పజిల్స్ పూర్తీ చేయడం నుండి కొత్త విషయాలు నేర్చుకోవడం వరకు ఏదైనా చేయవచ్చు.
ఇది కూడా చదవండి: జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నూనెలు వాడితే మ్యాజిక్కే!
ధ్యానం..
మెదడుకు దృఢం చేసే శక్తివంతమైన మార్గం ధ్యానం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగాలు మెదడు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచడం ద్వారా మెదడు కూడా శక్తివంతంగా మారుతుంది. ప్రతి రోజూ ధ్యానం చేసేవారికి జీవితం మీద స్పష్టత ఉంటుంది.
ప్రతికూల ఆలోచనలు..
మనిషి జీవితంలో ప్రతికూల విషయాలు ఎలా అయితే ఎదురవుతాయో.. అదే విధంగా ప్రతికూల ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు నిరాశ, నిస్పృహ, జీవితం మీద ఆశాభావం తగ్గుతాయి. కానీ అపజయాల నుండి, ప్రతికూల ఆలోచనల నుండి కూడా జీవితంలో ఎంతో నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితులలో అయినా పట్టుదలగా ఉండే విధంగా తయారవుతారు.
ఇది కూడా చదవండి: ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!
ఇంద్రియాల శిక్షణ..
వాసన చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, స్పర్శ ఇవన్నీ సాధారణంగా రోజులో జరిగేవే. అయితే వీటిని రోజులో కనీసం 10నిమిషాల పాటు ప్రతి విషయాన్నిసునిశితంగా పరిశీలించాలి. కాఫీ, టీ , కూల్ డ్రింక్, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు వాటి రుచిని. ఏదైనా వింటున్నప్పుడు అందులో అర్థాన్ని, ఎవరైనా తాకినప్పుడు శరీర స్పందనలు, వాసన చూసినప్పుడు మనసుకు ఎలాంటి అనుభూతి కలిగిందో అన్నీ గమనిస్తే మెదడు చాలా దృఢంగా మారుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవడం..
కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ మెదడును పదును పెడుతూనే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మెదడులో మైలిన్ అనే తెల్లని పదార్థం పెరుగుతూనే ఉంటుందట. ఇది జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా న్యూరాన్ లను కూడా ప్రేరేపిస్తుంది. నాడీ మార్గాలు క్లియర్ అవుతాయి. దేన్నైనా కాన్పిడెన్స్ తో చేసే మెంటాలిటీ అలవడుతుంది.
ఇది కూడా చదవండి: Eye Sight: ఈ 5 ఆహారాలు ట్రై చేశారంటే కళ్లజోడు అవసరమే ఉండదు.. డేగలాంటి చూపు ఖాయం!
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 08 , 2024 | 01:08 PM